పెద్దన్న వెనక రీజన్ చెప్పిన సురేష్ బాబు

రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా పెద్దన్న. ప్రస్తుతం కోలీవుడ్ లో రిలీజ్ కు రెడీ అయిన పెద్ద సినిమాల్లో ఇది కూడా ఒకటి. రజనీకాంత్ సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు చాలామంది పోటీపడుతుంటారు. అయితే ఈసారి ఆ పోటీలోకి సురేష్ బాబు లాంటి కాలిక్యులేటెడ్ ప్రొడ్యూసర్ చేరడమే కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. దీనిపై సురేష్ బాబు స్పందించారు. పెద్దన్న సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడం వెనక కారణాన్ని బయటపెట్టారు. “మేం ఈ సినిమాను ఎందుకు తీసుకున్నామా అనే అనుమానం అందరికీ […]

Advertisement
Update:2021-10-31 13:18 IST

రజనీకాంత్ హీరోగా నటించిన సినిమా పెద్దన్న. ప్రస్తుతం కోలీవుడ్ లో రిలీజ్ కు రెడీ అయిన పెద్ద సినిమాల్లో ఇది కూడా ఒకటి. రజనీకాంత్ సినిమాను తెలుగులో రిలీజ్ చేసేందుకు చాలామంది పోటీపడుతుంటారు. అయితే ఈసారి ఆ పోటీలోకి సురేష్ బాబు లాంటి కాలిక్యులేటెడ్ ప్రొడ్యూసర్ చేరడమే కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. దీనిపై సురేష్ బాబు స్పందించారు. పెద్దన్న సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ దక్కించుకోవడం వెనక కారణాన్ని బయటపెట్టారు.

“మేం ఈ సినిమాను ఎందుకు తీసుకున్నామా అనే అనుమానం అందరికీ రావొచ్చు. కరోనా తరువాత
ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ పెద్ద సినిమాను తీసుకొస్తే ఇంకా బాగుంటుందని అనుకున్నాం. అందరూ థియేటర్‌కు వచ్చి చూసే సినిమా. అందుకే మేం ముందుకొచ్చి రిలీజ్ చేస్తున్నాం.”

ఇలా పెద్దన్న సినిమా హక్కుల్ని దక్కించుకోవడం వెనక కారణాన్ని బయటపెట్టారు సురేష్ బాబు. ఏసియన్
ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థతో కలిసి సురేష్ బాబు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇకపై కూడా కంటెంట్ బాగున్న మంచి చిత్రాల్ని నారణ్ దాస్ నారంగ్ తో కలిసి రిలీజ్ చేస్తామని ప్రకటించారు సురేష్ బాబు.

ఇటు సురేష్ బాబుకు, అటు ఏసియన్ గ్రూప్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున థియేటర్లు ఉన్న సంగతి
తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమాను రిలీజ్ చేస్తే, ఆ సినిమాకు రీచ్ ఎక్కువగా ఉంటుందన్నమాట.

Tags:    
Advertisement

Similar News