మరో సినిమా ప్రకటించిన రవితేజ

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో 3 సినిమాలున్నాయి. తాజాగా మరో సినిమా కూడా ప్రకటించాడు మాస్ రాజా. కెరీర్ లో రవితేజకు ఇది 70వ సినిమా కావడం విశేషం. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ 70వ సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తూ […]

Advertisement
Update:2021-10-31 13:16 IST

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో 3 సినిమాలున్నాయి. తాజాగా మరో సినిమా కూడా ప్రకటించాడు మాస్ రాజా. కెరీర్ లో రవితేజకు ఇది 70వ సినిమా కావడం విశేషం. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

రవితేజ 70వ సినిమాకు సంబంధించిన ప్రకటన చేస్తూ విడుదల చేసిన పోస్టర్ లో హీరోస్ డోట్ ఎగ్జిస్ట్ అని కొటేషన్ రాసి ఉంది. ఇక వెనకాల చెక్కినట్టుగా రకరకాల శిల్పాలు కనిపిస్తున్నాయి. అలా మొత్తానికి సినిమాలో ఏదో కొత్త కథ, కాన్సెప్ట్ ఉన్నట్టు అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. నవంబర్ 5న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ ను లీజ్ చేయబోతున్నారు.

రచయితగా శ్రీకాంత్ విస్సా ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. ఆయనే ఈ సినిమాకు కథ అందించాడు. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టయిలిష్ గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నాడట. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ సినిమా.

Tags:    
Advertisement

Similar News