మంచి రోజులొచ్చాయి ట్రయిలర్ రివ్యూ

మారుతి ఓ సినిమా తీశాడంటే అందులో ఫన్ లేకుండా ఉండదు. సినిమాలో దాదాపు 80శాతం వినోదానికే కేటాయిస్తాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న మంచి రోజులొచ్చాయి సినిమా కూడా ఇదే కోవకు చెందుతుంది. ఈరోజు రిలీజైన ట్రయిలర్ దానికి నిదర్శనంగా నిలుస్తుంది. సంతోష్ శోభన్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కింది మంచి రోజులొచ్చాయి సినిమా. ఇందులో హీరోయిన్ తండ్రిగా అజయ్ ఘోష్ నటించాడు. కాబోయే మామను సంతోష్ శోభన్ ఎలా ఇబ్బందులు పెట్టాడు, అందులోంచి ఎలాంటి కామెడీ పుట్టిందనే విషయాన్ని ట్రయిలర్ […]

Advertisement
Update:2021-10-30 13:52 IST

మారుతి ఓ సినిమా తీశాడంటే అందులో ఫన్ లేకుండా ఉండదు. సినిమాలో దాదాపు 80శాతం వినోదానికే
కేటాయిస్తాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న మంచి రోజులొచ్చాయి సినిమా కూడా ఇదే కోవకు
చెందుతుంది. ఈరోజు రిలీజైన ట్రయిలర్ దానికి నిదర్శనంగా నిలుస్తుంది.

సంతోష్ శోభన్, మెహ్రీన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కింది మంచి రోజులొచ్చాయి సినిమా. ఇందులో హీరోయిన్ తండ్రిగా అజయ్ ఘోష్ నటించాడు. కాబోయే మామను సంతోష్ శోభన్ ఎలా ఇబ్బందులు పెట్టాడు, అందులోంచి ఎలాంటి కామెడీ పుట్టిందనే విషయాన్ని ట్రయిలర్ లో చూపించారు.

సంతోష్, మెహ్రీన్ జోడీ బాగుంది. సినిమాలో వాళ్లిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరిందనే విషయం ట్రయిలర్ చూస్తేనే అర్థమౌతోంది. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నవంబర్ ఫస్ట్ వీక్ లో థియేటర్లలోకి రాబోతోంది ఈ సినిమా.

Full View

Tags:    
Advertisement

Similar News