వరుడు కావలెను మూవీ రివ్యూ

నటీనటులు: నాగశౌర్య, రీతువర్మ, నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు మాటలు: గణేష్ రావూరి ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు సంగీతం : విశాల్ చంద్రశేఖర్ నిర్మాత: సూర్య దేవర నాగవంశీ స్క్రీన్ ప్లే : శరత్, గణేష్ రావూరి కథ- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య నిడివి : 133 నిమిషాలు రేటింగ్: 2.5/5 ప్రేమకథల్లో కొత్తదనం కావాలంటే దొరుకుతుందా? ఇది సరికొత్త ప్రేమకథ అంటే నవ్వుతారు జనం. అంతలా ఈ జానర్ ను పీల్చి పిప్పి చేశారు మేకర్స్. మరి […]

Advertisement
Update:2021-10-29 12:19 IST

నటీనటులు: నాగశౌర్య, రీతువర్మ, నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు
మాటలు: గణేష్ రావూరి
ఛాయాగ్రహణం: వంశీ పచ్చిపులుసు
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
స్క్రీన్ ప్లే : శరత్, గణేష్ రావూరి
కథ- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
నిడివి : 133 నిమిషాలు
రేటింగ్: 2.5/5

ప్రేమకథల్లో కొత్తదనం కావాలంటే దొరుకుతుందా? ఇది సరికొత్త ప్రేమకథ అంటే నవ్వుతారు జనం. అంతలా ఈ జానర్ ను పీల్చి పిప్పి చేశారు మేకర్స్. మరి ఇలాంటి జానర్ లో వస్తున్న వరుడు కావలెను అనే ప్రేమకథలో కొత్తదనం ఉందా? ప్రేక్షకుల్ని మెప్పించే కోణం ఏముంది ఇందులో? అది తెలుసుకునేముందు ఈ సినిమా స్టోరీ ఏంటో చూద్దాం.

సొంతంగా ఓ స్టార్టప్ కంపెనీ పెట్టి నడుపుతుంది భూమి (రీతు వర్మ). ఆఫీస్ లో చాలా స్ట్రిక్ట్. పెళ్లికి కూడా
దూరం. అలాంటి అమ్మాయి జీవితంలోకి ఎంటర్ అవుతాడు ఆకాష్ (నాగశౌర్య). రీతూను ఇష్టపడతాడు.
ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. మరి ఆకాష్ ప్రేమలో భూమి పడిందా? భూమి ఎందుకు అంత
సీరియస్ గా ఉంటుంది? భూమి-ఆకాష్ మధ్య ఉన్న బలమైన కాన్ ఫ్లిక్ట్ ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ.

ఎన్నో ప్రేమకథల్లో ఉన్నట్టుగానే ఇందులో కూడా ఇగో, కమ్యూనికేషన్ గ్యాప్ అనే రెండు అంశాలు కీలకమైన రోల్ ప్లే చేశాయి. ఫ్లాష్ బ్యాక్ లో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, ప్రజెంట్ లో తెచ్చిపెట్టుకున్న ఇగో వల్ల ప్రేమను వ్యక్తపరుచుకోరు హీరోహీరోయిన్లు. వీళ్లిద్దరూ ఎక్కడ, ఎప్పుడు ఎలా ఓపెన్ అయ్యారనేది సినిమా.

సినిమా స్టార్ట్ అవ్వడమే పక్కా రొటీన్ గా స్టార్ట్ అవుతుంది. ఎన్నారై అబ్బాయి, దేశీ అమ్మాయి.. ఇద్దరి మధ్య సన్నివేశాలు. కూతురికి పెళ్లి చేయాలనుకునే తల్లి. హీరోయిన్ ను ఇంప్రెస్ చేయాలనుకునే హీరో. ఇలా రొటీన్ సన్నివేశాలతో సినిమా సాగిపోతుంది. ఫస్టాఫ్ లో ఉన్నంతలో రిలీఫ్ ఏదైనా ఉందంటే అది అక్కడక్కడ పేలిన వెన్నెల కిషోర్ కామెడీ మాత్రమే. గంట గడిస్తే తప్ప సినిమాలో ట్విస్ట్ ఏంటనేది అర్థంకాదు, కథ ముందుకు సాగదు.

ఇంటర్వెల్ బ్యాంగ్ లో దర్శకురాలు లక్ష్మీసౌజన్య మంచి ట్విస్ట్ ఇచ్చింది. అదే ట్విస్ట్, అంతే టెంపోతో
సెకండాఫ్ కంటిన్యూ అవుతుందనుకుంటే, మళ్లీ ప్రేక్షకుడికి ఆశాభంగం. అదే రొటీన్ స్కీన్ ప్లే. ఫ్లాష్ బ్యాక్
ఎపిసోడ్ తర్వాత మళ్లీ సినిమా ఫ్లాప్ అయిపోతుంది. ఎక్కడో క్లైమాక్స్ లో మళ్లీ లేస్తుంది. కానీ ఆ క్లైమాక్స్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని సగటు సినీ ప్రేక్షకుడు అర్థగంట ముందే ఊహించుకోవచ్చు. అంతటి తేలికైన క్లైమాక్స్ ఇది. ఇలాంటి సినిమాకు కీలకంగా వ్యవహరించాల్సిన స్క్రీన్ ప్లే, మ్యూజిక్ డిపార్ట్ మెంట్లు
తేలిపోయాయి.

కథను ఇంకాస్త ఎంగేజింగ్ గా, వినోదాత్మకంగా రాసుకుంటే బాగుండేది. స్లోగా సాగడం ఈ సినిమాలో ప్రధాన
లోపం. ఇలాంటి కథలకు మ్యూజిక్ చాలా ముఖ్యం. పాటలు బాగా హిట్టవ్వాలి. ఆ మేజిక్ ఈ సినిమాలో
జరగలేదు. దీనికితోడు ఓ పాటలో రీతూవర్మ స్టెప్పులు మరీ పేలవంగా ఉన్నాయి. దీంతో సినిమా సహనానికి పరీక్ష పెడుతుంది. ఇన్ని నెగెటివ్స్ మధ్య కూడా సినిమా ఆసక్తికరంగా సాగడానికి కొన్ని కారణాలున్నాయి. వాటిలో ఒకటి వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ కాగా, రెండోది సెకెండాఫ్ లో వచ్చే సప్తగిరి-పమ్మి సాయి కామెడీ. ఈరెండు ఎలిమెంట్స్ తో పాటు హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ సినిమాను అంతోఇంతో నిలబెట్టింది. లేదంటే ఫలితం మరోలా ఉండేది.

నటీనటుల్లో హీరోహీరోయిన్ల తర్వాత మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్, సప్తగిరి పాత్రలు మెప్పిస్తాయి. కానీ మురళీశర్మ పాత్రను మరీ కుదించేశారు. నదియా పాత్రను మరీ సాత్వికంగా మార్చేశారు. ఇక రోహిణి క్యారెక్టర్ అయితే మరీ ఘోరం. ఓ సీన్ లో మెరుపుతీగలా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుందామె. టెక్నికల్ గా
ఇంతకుముందే చెప్పుకున్నట్టు సినిమాటోగ్రఫీ తర్వాత గణేశ్ రావూరి డైలాగ్స్ మెప్పిస్తాయి. కొన్ని సన్నివేశాల్లో అతడి డైలాగ్స్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యాయి. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగాలేదు.

ఓవరాల్ గా 3 సున్నితమైన ప్రేమ సన్నివేశాలు, మరో 2 భావోద్వేగమైన సన్నివేశాలు, సెకెండాఫ్ లో కడుపుబ్బా నవ్వించే ఇంకో 2 సీన్ల కోసం వరుడు కావలెను సినిమాను ఓసారి చూడొచ్చు.

Tags:    
Advertisement

Similar News