ఎట్టకేలకు ఆర్యన్ ఖాన్ కు బెయిల్

షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ముంబయి క్రూయిజ్ షిప్ లో జరిగిన డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి 3 వారాలకు పైగా పోలీస్ కస్టడీలో ఉన్న ఆర్యన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ఆర్యన్ బెయిల్ పై ఈరోజు బాంబే హైకోర్టులో వాదనలు జరిగాయి. 3 వారాలైనా ఆర్యన్ కు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించలేకపోయింది ఎన్సీబీ. దీంతో ఆర్యన్ […]

Advertisement
Update:2021-10-28 15:11 IST

షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ముంబయి క్రూయిజ్ షిప్ లో జరిగిన
డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి 3 వారాలకు పైగా పోలీస్ కస్టడీలో ఉన్న ఆర్యన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది.

ఆర్యన్ బెయిల్ పై ఈరోజు బాంబే హైకోర్టులో వాదనలు జరిగాయి. 3 వారాలైనా ఆర్యన్ కు వ్యతిరేకంగా
ఆధారాలు సేకరించలేకపోయింది ఎన్సీబీ. దీంతో ఆర్యన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. లెక్కప్రకారం వారం కిందటే ఆర్యన్ కు బెయిల్ రావాల్సి ఉంది. కానీ ఆఖరి నిమిషంలో ఆర్యన్ మొబైల్ లోని వాట్సాప్ చాట్స్ ను కోర్టుకు సమర్పించింది ఎన్సీబీ. అందులో హీరోయిన్ అనన్య పాండేతో అతడు జరిపిన వాట్సాప్ సంభాషణ, అందులో డ్రగ్స్ ప్రస్తావన ఉంది. దీంతో కోర్టు బెయిల్ నిరాకరించింది.

అయితే ఆ దిశగా కూడా ఎన్సీబీ అధికారులు ప్రగతి సాధించలేకపోయారు. అనన్య పాండేను 3 సార్లు
విచారించిన అధికారులు, సరైన ఆధారాలు సేకరించలేకపోయారు. దీంతో ఆర్యన్ ఖాన్ కు బెయిల్
మంజూరైంది. మరోవైపు ఆర్యన్ బెయిల్ కోసం 25 కోట్ల లంచం డిమాండ్ చేశారనే అంశంపై కొత్త వివాదం
ముసురుకుంది. రాబోయే రోజుల్లో ఈ కేసు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News