హోటళ్లు మూత.. 24లక్షల ఉద్యోగాలకు కోత..
కరోనా తదనంతర పరిస్థితులు ప్రజల జీవన విధానం, ఉపాధి రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ వల్ల భారత్ లో హోటళ్లు, ఇతర ఆహార తయారీ, విక్రయ సంబంధమైన దుకాణాలు మూతపడ్డాయి. పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు, ఆంక్షలు సడలిస్తున్నా.. యాజమాన్యాలు తిరిగి హోటళ్లను తెరిచేందుకు సాహసం చేయలేకపోతున్నాయి. ఈ కారణంగా దేెశవ్యాప్తంగా మొత్తం 24లక్షలమంది తమ ఉద్యోగాలు కోల్పోయినట్టు సర్వేలు చెబుతున్నాయి. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ అందించిన సమాచారం మేరకు 53శాతం మేర […]
కరోనా తదనంతర పరిస్థితులు ప్రజల జీవన విధానం, ఉపాధి రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా లాక్ డౌన్ వల్ల భారత్ లో హోటళ్లు, ఇతర ఆహార తయారీ, విక్రయ సంబంధమైన దుకాణాలు మూతపడ్డాయి. పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు, ఆంక్షలు సడలిస్తున్నా.. యాజమాన్యాలు తిరిగి హోటళ్లను తెరిచేందుకు సాహసం చేయలేకపోతున్నాయి. ఈ కారణంగా దేెశవ్యాప్తంగా మొత్తం 24లక్షలమంది తమ ఉద్యోగాలు కోల్పోయినట్టు సర్వేలు చెబుతున్నాయి. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ అందించిన సమాచారం మేరకు 53శాతం మేర హోటళ్ల రంగంలో ఉపాధికి గండిపడింది. కరోనాకి ముందు ఏడాదికి 4.2లక్షల కోట్ల రూపాయల బిజినెస్ జరిగే పరిస్థితులు ఉండగా.. ఇప్పుడు కేవలం 2లక్షల కోట్లకు బిజినెస్ పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కేరళ ప్రాంతాల్లో పేరున్న పెద్ద పెద్ద హోటళ్లను సైతం కరోనా కష్టకాలంలో మూసివేశారు. ఫస్ట్ వేవ్ తర్వాత ఉత్సాహంగా చాలా చోట్ల హోటళ్లను నడిపేందుకు ప్రయత్నించినా.. సెకండ్ వేవ్ దెబ్బతో యాజమాన్యాలు కోలుకోలేకపోయాయి. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడుతున్నా కూడా ఎక్కడో చిన్న అనుమానం వారిని వెంటాడుతోంది. దీంతో ఇప్పటికిప్పుడే హోటళ్లను తెరిచేందుకు, కొత్తగా బిజినస్ మొదలు పెట్టేందుకు ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు.
కరోనా కాలంలో ప్రపంచ వ్యాప్తంగా హోటళ్ల రంగం తీవ్ర ఇబ్బందులు పడింది. పేరున్న హోటళ్లే కాదు, అసంఘటిత రంగంలో చిన్న చిన్న ఆహార విక్రయ శాలలపై ఆధారపడిన చాలామంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారంతా వేర్వేరు పనులను చూసుకున్నారు. దీంతో హోటళ్ల రంగం ఇప్పుడు సరైన పనివాళ్ల కొరత కూడా ఎదుర్కొంటోంది. అదే సమయంలో హోమ్ డెలివరీ, పార్శిళ్ల రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో 33శాతం వాటా పార్శిళ్ల రంగానికి ఉండగా.. ఇప్పుడది 13శాతానికి చేరుకుంది, క్రమక్రమంగా మెరుగవుతోంది. అయితే హోటళ్లు మాత్రం మూతపడే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఆహార పదార్థాల తయారీ, విక్రయ రంగంపై 73లక్షల మంది ఆధారపడి ఉన్నారని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చెబుతోంది.