సర్కారువారి పాట షూటింగ్ అప్ డేట్

సర్కారువారి పాట సినిమాకు సంబంధించి మరో కీలక షెడ్యూల్ ముగిసింది. యూరోప్ లోని స్పెయిన్ లో కొన్ని రోజులుగా ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. తాజాగా ఆ షెడ్యూల్ కూడా ముగిసింది. యూరోప్ షెడ్యూల్ లో మహేష్-కీర్తిసురేష్ పై ఓ సాంగ్ తీశారు. మహేష్, వెన్నెల కిషోర్, కీర్తిసురేష్, ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలు కూడా తీశారు. కరోనా తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చేసిన ఈ షూటింగ్ దిగ్విజయంగా పూర్తయినట్టు యూనిట్ ప్రకటించింది. సినిమాకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్, గోవాలో […]

Advertisement
Update:2021-10-26 09:07 IST

సర్కారువారి పాట సినిమాకు సంబంధించి మరో కీలక షెడ్యూల్ ముగిసింది. యూరోప్ లోని స్పెయిన్ లో
కొన్ని రోజులుగా ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. తాజాగా ఆ షెడ్యూల్ కూడా ముగిసింది. యూరోప్ షెడ్యూల్ లో మహేష్-కీర్తిసురేష్ పై ఓ సాంగ్ తీశారు. మహేష్, వెన్నెల కిషోర్, కీర్తిసురేష్, ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలు కూడా తీశారు. కరోనా తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకొని చేసిన ఈ షూటింగ్ దిగ్విజయంగా పూర్తయినట్టు యూనిట్ ప్రకటించింది.

సినిమాకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్, గోవాలో భారీ షెడ్యూల్ పూర్తయ్యాయి. ఇప్పుడు స్పెయిన్
షెడ్యూల్ కూడా పూర్తవ్వడంతో సినిమా షూటింగ్ అంతా దాదాపు ఓ కొలిక్కి వచ్చేసింది. నెక్ట్స్ షెడ్యూల్ ను
హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. దీని కోసం హైదరాబాద్ లో భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఆ సెట్ లో మహేష్,
కీర్తిసురేష్ పై ఓ సాంగ్ తీయబోతున్నారు.

సంక్రాంతి బరిలో సర్కారువారి పాట సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆర్ఆర్ఆర్ రాకతో మహేష్ మూవీని పోస్ట్ పోన్ చేశారు. దీంతో రిలీజ్ చేయాలనుకున్న సాంగ్ ను కూడా ఆపేశారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Tags:    
Advertisement

Similar News