ఆ 15 నిమిషాలు హైలెట్ అంటున్న శౌర్య

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది వరుడు కావలెను సినిమా. రానా చేతుల మీదుగా ట్రయిలర్ ఆల్రెడీ రిలీజైంది. అది చూస్తే ఓ లవ్ స్టోరీ, పెళ్లి కథ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. అంతకుమించి కొత్తదనం లేదనిపిస్తోంది. అయితే సినిమాలో ఓ సర్ ప్రైజ్ ప్యాకేజీ ఉందంటున్నాడు హీరో నాగశౌర్య. “సినిమా సెకెండాఫ్ లో ఓ 15 నిమిషాల ఎపిసోడ్ ఉంది. అది కావాలనే దాచిపెట్టాం. ఆ ఎపిసోడ్ థియేటర్లలోనే చూడాలి. ఆడియన్స్ కొత్తగా ఫీల్ అవుతారు. అలా […]

Advertisement
Update:2021-10-26 09:11 IST

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది వరుడు కావలెను సినిమా. రానా చేతుల మీదుగా ట్రయిలర్
ఆల్రెడీ రిలీజైంది. అది చూస్తే ఓ లవ్ స్టోరీ, పెళ్లి కథ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. అంతకుమించి కొత్తదనం లేదనిపిస్తోంది. అయితే సినిమాలో ఓ సర్ ప్రైజ్ ప్యాకేజీ ఉందంటున్నాడు హీరో నాగశౌర్య.

“సినిమా సెకెండాఫ్ లో ఓ 15 నిమిషాల ఎపిసోడ్ ఉంది. అది కావాలనే దాచిపెట్టాం. ఆ ఎపిసోడ్ థియేటర్లలోనే చూడాలి. ఆడియన్స్ కొత్తగా ఫీల్ అవుతారు. అలా అని మరీ సర్ ప్రైజ్ కాదు. సడెన్ గా చూసినప్పుడు చిన్న సర్ ప్రైజ్ అనిపిస్తుంది.”

ఈ సినిమాను తను ఒప్పుకోవడానికి కారణం ఆ 15 నిమిషాల ఎపిసోడ్ అంటున్నాడు శౌర్య. ఇతర లవ్ స్టోరీస్, ఫ్యామిలీ కథల నుంచి కాస్త డిఫరెంట్ గా అనిపించడానికి కారణం కూడా అదే అంటున్నాడు.

“ఆ 15 నిమిషాల చిన్న ఎపిసోడ్ లోనే కథకు సంబంధించిన క్యారెక్టర్ల ఎలివేషన్స్ ఉంటాయి. ఎందుకు
హీరోయిన్ అలా బిహేవ్ చేస్తుంది. సినిమా బ్యాక్ డ్రాప్ మొత్తం ఆ 15 నిమిషాల్లో కనిపిస్తుంది.”

రీతూవర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో లక్ష్మీసౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది ఈ సినిమా. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను రేపు
శిల్పకళావేదికలో చేయబోతున్నారు. అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్.

Tags:    
Advertisement

Similar News