సమ్మతమే అంటున్న కిరణ్ అబ్బవరం

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు. మెద‌టి చిత్రం రాజావారు రాణిగారు రస్టిక్ అండ్ రొమాంటిక్ డ్రామా కాగా.. రెండో చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపం రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఆ రెండూ కూడా కిరణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `సమ్మతమే’ అంటూ అర్బన్ బ్యాక్ డ్రాప్‌తో రాబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. […]

Advertisement
Update:2021-10-21 12:31 IST

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విభిన్న కథలను ఎంచుకుంటున్నాడు. మెద‌టి చిత్రం
రాజావారు రాణిగారు రస్టిక్ అండ్ రొమాంటిక్ డ్రామా కాగా.. రెండో చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపం రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఆ రెండూ కూడా కిరణ్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'సమ్మతమే’ అంటూ అర్బన్ బ్యాక్ డ్రాప్‌తో రాబోతున్నాడు.

ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను ఈరోజు మేకర్స్ విడుదల చేశారు. హీరో హీరోయిన్ల కారెక్టర్‌లో ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. హీరో కిరణ్ అబ్బవరం సైలెంట్, కూల్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తే.. హీరోయిన్ చాందినీ చౌదరి మాత్రం మందు కొడుతూ, దమ్ము కొడుతూ చిల్ అవుతోంది.

పాటలతో ఎదుటివారి ఫీలింగ్స్‌ను బయటపెట్టడంతో ఆడియెన్స్‌కు కొత్త ఫీలింగ్ వస్తోంది. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జోడి అందరినీ ఆకట్టుకునేలా ఉంది. డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి సరికొత్త ప్రేమకథతో రాబోతున్నాడనే విషయం అర్థమౌతూనే ఉంది. సతీష్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫి, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.

యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న సమ్మతమే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకో షెడ్యూల్ మాత్రమే బ్యాల‌న్స్ ఉంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తారు.

Full View

Tags:    
Advertisement

Similar News