మరో 2 రోజుల్లో రాధేశ్యామ్ టీజర్

చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ మళ్లీ రొమాంటిక్ జోనర్లో సినిమా చేస్తున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత రాధేశ్యామ్ సినిమాలో విక్రమాదిత్య అనే రొమాంటిక్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా 23న టీజర్ విడుదల చేయబోతున్నారు. విక్రమాదిత్య అంటే ఎవరు అంటూ పోస్టర్‌పై రాసుకొచ్చారు. టీజర్‌లో దీనికి సమాధానం చెప్పబోతున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో బాగా ఆలోచిస్తున్నాడు ప్రభాస్. ఈ ఫోటోలో ప్రభాస్ లుక్స్ చాలా షార్ప్‌గా ఉన్నాయి. కళ్లలో ఏదో తెలియని కంగారు కూడా […]

Advertisement
Update:2021-10-21 12:25 IST

చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ మళ్లీ రొమాంటిక్ జోనర్లో సినిమా చేస్తున్నాడు. దాదాపు పదేళ్ల తర్వాత
రాధేశ్యామ్ సినిమాలో విక్రమాదిత్య అనే రొమాంటిక్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రభాస్ పుట్టిన రోజు
సందర్భంగా 23న టీజర్ విడుదల చేయబోతున్నారు. విక్రమాదిత్య అంటే ఎవరు అంటూ పోస్టర్‌పై
రాసుకొచ్చారు. టీజర్‌లో దీనికి సమాధానం చెప్పబోతున్నారు.

తాజాగా విడుదలైన పోస్టర్‌లో బాగా ఆలోచిస్తున్నాడు ప్రభాస్. ఈ ఫోటోలో ప్రభాస్ లుక్స్ చాలా షార్ప్‌గా
ఉన్నాయి. కళ్లలో ఏదో తెలియని కంగారు కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్‌గా
అనిపిస్తుంది. బహుశా టీజర్ రిలీజైన తర్వాత ఈ పోస్టర్ కు అర్థం తెలుస్తుందేమో.

23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా రాబోతున్న విక్రమాదిత్య క్యారెక్టర్ టీజర్ లో డైలాగ్స్ అన్నీ ఇంగ్లీష్‌లో ఉండబోతున్నాయి. భిన్నమైన భాషల్లో సబ్ టైటిల్స్ కనిపిస్తాయి. దీని వల్ల ఏ భాషలో ఈ టీజర్ చూసినా ఆయా ప్రేక్షకులకు ఇబ్బంది ఉండదన్నమాట.

జనవరి 14, 2022న ఈ సినిమా విడుదల కానుంది. తెలుగుతో పాటు పాన్ ఇండియన్ స్థాయిలో వివిధ భాషల్లో రాధే శ్యామ్ విడుదల కానుంది. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్
నిర్మిస్తోంది.

Tags:    
Advertisement

Similar News