పట్టుకోవడం అంటే ఏంటో చెప్పిన పూరి

“పట్టుకోవడం అంటే ఏంటి? ముద్దు పెట్టుకోవడమా.. కౌగిలించుకోవడమా.. చేయి పట్టుకొని లాగడమా..?” హీరోయిన్ తల్లి ప్రశ్న ఇది. “ఇవన్నీ కలిపితే దాన్ని పట్టుకోవడం అంటారు.” హీరోయిన్ సమాధాన ఇది. రొమాంటిక్ అనే సినిమా ట్రయిలర్ లో హీరోహీరోయిన్ల మధ్య సంభాషణ ఇది. పూరి మార్కుకు పెర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న‌ రొమాంటిక్ డ్రామా రొమాంటిక్ అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా స్టార్ […]

Advertisement
Update:2021-10-20 01:49 IST

“పట్టుకోవడం అంటే ఏంటి? ముద్దు పెట్టుకోవడమా.. కౌగిలించుకోవడమా.. చేయి పట్టుకొని లాగడమా..?”
హీరోయిన్ తల్లి ప్రశ్న ఇది. “ఇవన్నీ కలిపితే దాన్ని పట్టుకోవడం అంటారు.” హీరోయిన్ సమాధాన ఇది.
రొమాంటిక్ అనే సినిమా ట్రయిలర్ లో హీరోహీరోయిన్ల మధ్య సంభాషణ ఇది. పూరి మార్కుకు పెర్ ఫెక్ట్
ఎగ్జాంపుల్ ఇది.

యంగ్ హీరో ఆకాష్ పూరి, అందాల హీరోయిన్ కేతిక శర్మ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న‌ రొమాంటిక్ డ్రామా రొమాంటిక్ అక్టోబర్ 29 విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా స్టార్ హీరో ప్రభాస్ చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

2నిమిషాల10 సెకన్ల నిడివిగ‌ల ఈ ట్రైల‌ర్‌ను గ‌మనిస్తే… రొమాంటిక్ టైటిల్‌కు న్యాయం చేసేలా ఉంది.
ఆకాష్ పూరి, కేతికల మధ్య రొమాంటిక్స్ సీన్స్ పుష్కలంగా ఉన్నాయ‌ని తెలుస్తోంది. స్వచ్చమైన ప్రేమకు,
శరీరాన్ని చూసి పుట్టే ప్రేమకు మధ్య ఉండే తేడాను ఈ సినిమాలో చూపించినట్టు కనిపిస్తోంది.

వాస్కో పాత్రలో ఆకాష్ పూరి, మౌనిక క్యారెక్టర్‌లో కేతిక శర్మ రొమాంటిక్స్ సీన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యేలా
ఉన్నారు. రొమాంటిక్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌, డైలాగ్ డెలివరీలో ఆకాష్ పూరి అద్భుతంగా న‌టించాడు. కేతిక శర్మ తన అందాలతో కుర్రకారును కట్టిపడేసేలా ఉంది. ఈ ఇద్దరి జోడి తెరపై ఫ్రెష్‌గా కనిపించింది. రమ్యకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. పైగా హీరోయిన్ తల్లి కూడా.

పూరి జగన్నాథ్ రాసిన డైలాగ్స్ రొమాంటిక్ చిత్రానికి ప్లస్ అవ‌నున్నాయి. సునీల్ కశ్యప్ సంగీతం, నరేష్
సినిటోగ్రఫీ బాగా కుదిరాయి. మొత్తంగా రొమాంటిక్ ట్రైలర్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది.

Full View

Tags:    
Advertisement

Similar News