మగాళ్లతోనే యుద్ధం.. లోకేశ్ అదోటైపు.. మంత్రి కొడాలి నాని
పథకం ప్రకారమే సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాటా తీస్తామని హెచ్చరించారు. పట్టాభి ఓ పెయిడ్ ఆర్టిస్టు అంటూ నాని విమర్శించారు. చంద్రబాబులాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఏం కాదని, సీఎం వైఎస్ జగన్‌ను ఇంచు కూడా కదపలేరని స్పష్టం చేశారు. అమిత్‌షాపై తిరుపతిలో చంద్రబాబు రాళ్లతో దాడి చేయించారని..చంద్రబాబు ఎలాంటి వ్యక్తో అమిత్‌షా, మోదీలకు తెలుసన్నారు. […]
పథకం ప్రకారమే సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాటా తీస్తామని హెచ్చరించారు. పట్టాభి ఓ పెయిడ్ ఆర్టిస్టు అంటూ నాని విమర్శించారు. చంద్రబాబులాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఏం కాదని, సీఎం వైఎస్ జగన్‌ను ఇంచు కూడా కదపలేరని స్పష్టం చేశారు. అమిత్‌షాపై తిరుపతిలో చంద్రబాబు రాళ్లతో దాడి చేయించారని..చంద్రబాబు ఎలాంటి వ్యక్తో అమిత్‌షా, మోదీలకు తెలుసన్నారు.
చంద్రబాబు చేసేవన్నీ నీచ రాజకీయాలేనని, ఆయన చేసే కొంగ జపాలను ఎవరూ నమ్మరని అన్నారు.పోసాని కృష్ణమురళి ఇంటిపై దాడి చేస్తే పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్‌లో పడుకున్నాడని, ఇప్పుడు టీడీపీ ఆఫీస్‌లో రెండు కుర్చీలు ఇరగ్గానే ప్రజాస్వామ్యం ఖూనీ అంటాడన్నారు.
టీడీపీ నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. యుద్ధంలో మగాళ్లతో ఫైట్ చేస్తామని.. లోకేశ్ లాంటి అటూ ఇటూ కానీ వాళ్ళతో ఏమి యుద్ధం చేస్తామన్నారు. లోకేశ్ విసిరిన ఛాలెంజ్‌కు తాము స్పందించేది లేదన్నారు. జీవితంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లోకేశ్ ఛాలెంజ్ చేయాలని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు.
అలాగే మంత్రి కన్నబాబు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉనికి కోసమే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కావాలనే చంద్రబాబు. ముఖ్యమంత్రిని బూతులు తిట్టించారని ఆరోపించారు.టీడీపీకి ప్రజల నుంచి సానుభూతి తీసుకొచ్చేందుకు ఈ వ్యవహారం మొత్తం నడిపారని వ్యాఖ్యానించారు.
‘ఇది కేవలం యాక్షన్ కు రియాక్షన్ మాత్రమే. టీడీపీ నేత పట్టాభి ముఖ్యమంత్రిపై నోరుపారేసుకున్నారు. స్థాయి మరిచి మాట్లాడారు. దానికి ప్రజల నుంచి ఈ స్థాయిలో రియాక్షన్ వచ్చింది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు తన కుయుక్తితో దీన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని ప్లాన్ వేశారు. నిన్న టీవీలు చూసిన వారికి ఈ విషయం అర్థమవుతుంది. డీజీపీని పట్టుకొని పాలేరు అంటూ మాట్లాడారు. ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్టు తిట్టారు. అప్పుడు చంద్రబాబు కనీసం ఖండించలేదు. తన వాళ్లను పిలిచి మందలించలేదు. కానీ టీడీపీ ఆఫీసుపై దాడి జరగగానే రాజకీయ ప్రయోజనం కోసం బయలు దేరారు. ఆయన మీడియాను అడ్డుపెట్టుకొని ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎవరూ నమ్మరు’ అంటూ అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.