ఆయన శ్రీలీల తండ్రి కాదంట..!

ఆమె ఓ హీరోయిన్. ఒకే ఒక్క సినిమా చేసింది. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితేనేం ఆ ఒక్క సినిమాతో ఆమె ఇప్పుడు టోటల్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఆ హీరోయిన్ పేరు శ్రీలీల. ఆమె సడెన్ గా పాపులర్ అవ్వడానికి కారణం, ఆమె నటించిన పెళ్లిసందD సినిమా కాదు. ఆమె తండ్రి ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. శ్రీలీల తెలుగమ్మాయి. ఆంధ్రప్రదేశ్ లో ఓ పాపులర్ కమ్యూనిటీలో పుట్టిన పిల్ల. ఈమధ్య ఆమె […]

Advertisement
Update:2021-10-17 15:10 IST

ఆమె ఓ హీరోయిన్. ఒకే ఒక్క సినిమా చేసింది. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితేనేం ఆ ఒక్క
సినిమాతో ఆమె ఇప్పుడు టోటల్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఆ హీరోయిన్ పేరు శ్రీలీల. ఆమె సడెన్ గా పాపులర్ అవ్వడానికి కారణం, ఆమె నటించిన పెళ్లిసందD సినిమా కాదు. ఆమె తండ్రి ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

శ్రీలీల తెలుగమ్మాయి. ఆంధ్రప్రదేశ్ లో ఓ పాపులర్ కమ్యూనిటీలో పుట్టిన పిల్ల. ఈమధ్య ఆమె తండ్రి పేరును ఎక్కడో చెప్పిందట. మరి ఆమె చెప్పిందా, లేక మీడియా పొరపడిందో తెలియదు కానీ.. సూరపనేని శుభాకర్ అనే పెద్ద వ్యాపారవేత్త శ్రీలీల తండ్రి అంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చేశాయి. ఇందులో ట్విస్ట్ ఏముందని అనుకుంటున్నారా? ఈరోజు ఆ సూరపనేని శుభాకర్ మీడియా ముందుకొచ్చాడు. శ్రీలీల తన కూతురు కాదని ప్రకటించాడు.

అవును.. శ్రీలీలకు తనకు సంబంధం లేదని ప్రకటించాడు శుభాకర్. మరి ఈ మొత్తం వ్యవహారంలో శుభాకర్ పేరు ఎందుకు తెరపైకొచ్చింది. దానికి కూడా వివరణ ఇచ్చాడు శుభాకర్. శ్రీలీల తల్లి, శుభాకర్ భార్యాభర్తలు. అయితే ఇది ఒకప్పుడు. 20 ఏళ్ల కిందటే తామిద్దరం విడిపోయాం అంటున్నాడు శుభాకర్. తాము విడిపోయిన తర్వాత శ్రీలీల పుట్టిందని, తనకు శ్రీలీలకు సంబంధం లేదని ప్రకటించాడు. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News