తన పని పూర్తిచేసిన "జానకి"

ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఓ కీలక ఘట్టం ముగిసింది. ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న కృతి సనన్, తన పార్ట్ మొత్తం పూర్తిచేసింది. ఇందులో ప్రభాస్ ఆదిపురుష్ పాత్రలో, కృతి సనన్ జానకి (సీత) పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మేరకు జానకి రోల్ కు సంబంధించిన షూట్ పూర్తయినట్టు కృతి సనన్ ప్రకటించింది. ఆదిపురుష్ సినిమాలో జానకి ఎంత ఎంత కీలకమనే విషయం అందరికీ తెలిసిందే. సినిమాలో ఆదిపురుష్ తో ఆమెకు ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుందో.. […]

Advertisement
Update:2021-10-17 15:06 IST

ఆదిపురుష్ సినిమాకు సంబంధించి ఓ కీలక ఘట్టం ముగిసింది. ఈ సినిమాలో సీత పాత్ర పోషిస్తున్న కృతి
సనన్, తన పార్ట్ మొత్తం పూర్తిచేసింది. ఇందులో ప్రభాస్ ఆదిపురుష్ పాత్రలో, కృతి సనన్ జానకి (సీత)
పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మేరకు జానకి రోల్ కు సంబంధించిన షూట్ పూర్తయినట్టు కృతి సనన్
ప్రకటించింది.

ఆదిపురుష్ సినిమాలో జానకి ఎంత ఎంత కీలకమనే విషయం అందరికీ తెలిసిందే. సినిమాలో ఆదిపురుష్ తో ఆమెకు ఎంత స్క్రీన్ స్పేస్ ఉంటుందో.. రావణ్ పాత్రతో కూడా అంతే స్క్రీన్ స్పేస్ ఉంటుంది. దాదాపు
సినిమా అంతా కనిపించే ఆ పార్ట్ ను పూర్తిచేసినట్టు కృతి ప్రకటించింది. సో.. ఈ మూవీ షూటింగ్ దాదాపు
కొలిక్కి వచ్చేసినట్టే.

అటు ప్రభాస్ కూడా ప్రస్తుతం ఆదిపురుష్ షూట్ లోనే ఉన్నాడు. ముంబయిలో ప్రభాస్-సైఫ్ అలీఖాన్ మధ్య వచ్చే కీలక సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు. రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించిన యూనిట్, ఆ తేదీకి తగ్గట్టు పనులు పూర్తయ్యేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు.

Tags:    
Advertisement

Similar News