నాని "దసరా" కానుక అదిరింది

నేచురల్ స్టార్ నాని చేసే ప్రతీ సినిమా, ఎంచుకునే ప్రతీ పాత్ర కొత్తగానే ఉంటుంది. అయితే ఇప్పుడు నాని ఎంచుకున్న కారెక్టర్ మాత్రం ఇదివరకు ఎన్నడూ చూడనిది. ఈ సినిమా పేరు దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతోన్న నాని కొత్త సినిమాకు దసరా అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ, పోస్టర్ రిలీజ్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటించనుంది. దసరా సందర్భంగా […]

Advertisement
Update:2021-10-16 13:41 IST

నేచురల్ స్టార్ నాని చేసే ప్రతీ సినిమా, ఎంచుకునే ప్రతీ పాత్ర కొత్తగానే ఉంటుంది. అయితే ఇప్పుడు నాని ఎంచుకున్న కారెక్టర్ మాత్రం ఇదివరకు ఎన్నడూ చూడనిది. ఈ సినిమా పేరు దసరా.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతోన్న నాని కొత్త సినిమాకు దసరా అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ, పోస్టర్ రిలీజ్ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ఎల్‌వీసీ) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్‌గా నటించనుంది.

దసరా సందర్భంగా పోస్టర్‌తో పాటు ఓ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని నేపథ్యం,
కాన్సెప్ట్‌ను ఎలా ఉంటుందో ఓ చిన్న హింట్ ఇచ్చారు. ఇందులో నాని, కీర్తి సురేష్ లుక్ ఎలా ఉంటుందో
చూపించారు. ఒకప్పటి కాలంలోని రైళ్లు, ఆ ట్రాక్, బతుకమ్మ పాట ఇలా అన్నింటిని చూస్తుంటే ఇది పక్కా
తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇక చివర్లో నాని తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్
అదిరిపోయింది.

ఈ చిత్రం గోదావరి ఖనిలోని బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కనుంది. సముద్రఖని, సాయి కుమార్, జరినా
వాహబ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని
సమకూర్చుతుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు.

Full View

Tags:    
Advertisement

Similar News