పోలీసాఫీసర్ గా ప్రభాస్?

హీరో ప్రభాస్ త్వరలోనే పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇలా ఖాకీ దుస్తుల్లో ప్రభాస్ కనిపించడం ఇదే తొలిసారి కాబోతోంది. దీనికి స్పిరిట్ అనే సినిమా వేదిక కాబోతోంది. ప్రభాస్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం ఇది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రీసెంట్ గా స్పిరిట్ అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు ప్రభాస్. టీ-సిరీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడట. అయితే ఇది పక్కా పోలీస్ స్టోరీనా లేక […]

Advertisement
Update:2021-10-13 13:51 IST

హీరో ప్రభాస్ త్వరలోనే పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇలా ఖాకీ దుస్తుల్లో ప్రభాస్ కనిపించడం ఇదే తొలిసారి కాబోతోంది. దీనికి స్పిరిట్ అనే సినిమా వేదిక కాబోతోంది. ప్రభాస్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం ఇది.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రీసెంట్ గా స్పిరిట్ అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు ప్రభాస్. టీ-సిరీస్,
యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ పోలీసాఫీసర్ గా కనిపిస్తాడట.
అయితే ఇది పక్కా పోలీస్ స్టోరీనా లేక సూపర్ కాప్ టైపు సినిమానా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

కెరీర్ లో ఇప్పటివరకు ప్రభాస్ ఖాకీ చొక్కా వేసుకున్నది లేదు. హీరోలంతా కావాలని పోలీస్ పాత్రలు
చేస్తుంటారు. రవితేజ అయితే ఇప్పటికే ఎన్నోసార్లు ఈ తరహా పాత్రలు చేశాడు. మహేష్ బాబు, పవన్ కల్యాణ్, చరణ్, ఎన్టీఆర్.. ఇలా అంతా ఖాకీ చొక్కాను కవర్ చేసినోళ్లే. కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటివరకు యూనిఫారమ్ టచ్ చేయలేదు. ఇన్నాళ్లకు ఆ రోజు రానే వచ్చింది. సందీప్ వంగ దర్శకత్వంలో ప్రభాస్ ఖాకీ చొక్కాలో కనిపించడం గ్యారెంటీ అంటున్నారు అతడి ఫ్యాన్స్.

Tags:    
Advertisement

Similar News