ఈ వీకెండ్ సినిమాలు

ఈ వీకెండ్ కు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది దసరా వీకెండ్. బాక్సాఫీస్ కళకళలాడే సీజన్. అందుకే కాస్త అంచనాలున్న 3 సినిమాలు ఈ వారాంతం థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోదగ్గ సినిమా మహాసముద్రం. శర్వానంద్-సిద్దార్థ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అజయ్ భూపతి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్, అదితి రావు హీరోయిన్లుగా నటించారు. ఇక మహాసముద్రానికి పోటీగా వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా […]

Advertisement
Update:2021-10-13 13:46 IST

ఈ వీకెండ్ కు చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇది దసరా వీకెండ్. బాక్సాఫీస్ కళకళలాడే సీజన్. అందుకే కాస్త అంచనాలున్న 3 సినిమాలు ఈ వారాంతం థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ముందుగా చెప్పుకోదగ్గ సినిమా మహాసముద్రం. శర్వానంద్-సిద్దార్థ్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ సినిమాపై భారీ
అంచనాలున్నాయి. అజయ్ భూపతి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో అను ఎమ్మాన్యుయేల్, అదితి రావు
హీరోయిన్లుగా నటించారు.

ఇక మహాసముద్రానికి పోటీగా వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమా హీరో అఖిల్ కు చాలా ఇంపార్టెంట్. సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్, ఈ సినిమా సక్సెస్ కోసం ఆత్రుతగా
ఎదురుచూస్తున్నాడు. అటు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కైతే ఇది ఇంకా ఇంపార్టెంట్. ఈ సినిమా రిజల్ట్
తేడాకొడితే అతడి కెరీర్ క్లోజ్ అయినట్టే. పూజాహెగ్డే ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్

పై రెండు సినిమాలతో పాటు దసరా బరిలో నిలిచిన మూవీ పెళ్లిసందD. అలనాటి బ్లాక్ బస్టర్ పెళ్లిసందడి
సినిమా మేజిక్ ను రిపీట్ చేసే టార్గెట్ తో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కింది ఈ సినిమా.
అలనాటి పెళ్లి సందడిలో శ్రీకాంత్ హీరోగా నటిస్తే, తాజా పెళ్లిసందDలో అతడి అబ్బాయి రోషన్ హీరో. శ్రీలీల హీరోయిన్ గా పరిచయమౌతున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించాడు.

దసరా బరిలో నిలిచిన ఈ మూడు సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News