అఖండ హీరోయిన్ కు కరోనా పాజిటివ్

అఖండ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైశ్వాల్ మరోసారి కరోనా బారిన పడింది. ఈమెకు ఇదివరకే ఓసారి కరోనా సోకింది. అప్పుడామె కోలుకుంది. తాజాగా ఇప్పుడు మరోసారి కరోనా బారిన పడింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. ప్రగ్యా జైశ్వాల్, రెండు డోసుల కరోనా టీకా తీసుకుంది. అయినప్పటికీ ఆమెకు తాజా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ప్రగ్యాకు కరోనా సోకడంతో అఖండ టీమ్ ఉలిక్కి పడింది. ఎందుకంటే, ఆమెకు కరోనా సోకడానికి జస్ట్ 3 రోజుల ముందే అఖండ యూనిట్ […]

Advertisement
Update:2021-10-11 13:15 IST

అఖండ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైశ్వాల్ మరోసారి కరోనా బారిన పడింది. ఈమెకు ఇదివరకే ఓసారి కరోనా సోకింది. అప్పుడామె కోలుకుంది. తాజాగా ఇప్పుడు మరోసారి కరోనా బారిన పడింది. బాధాకరమైన విషయం ఏంటంటే.. ప్రగ్యా జైశ్వాల్, రెండు డోసుల కరోనా టీకా తీసుకుంది. అయినప్పటికీ ఆమెకు తాజా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది.

ప్రగ్యాకు కరోనా సోకడంతో అఖండ టీమ్ ఉలిక్కి పడింది. ఎందుకంటే, ఆమెకు కరోనా సోకడానికి జస్ట్ 3 రోజుల ముందే అఖండ యూనిట్ పెద్ద పార్టీ చేసుకుంది. షూటింగ్ సక్సెస్ ఫుల్ గా పూర్తయిన సందర్భంగా చేసుకున్న ఆ పార్టీలో ప్రగ్యా జైశ్వాల్ కూడా పాల్గొంది. ఫొటోలు కూడా బయటకొచ్చాయి. ఆ పార్టీలో హీరోయిన్ ప్రగ్యా, హీరో బాలకృష్ణతో పాటు ఎవ్వరూ మాస్కులు పెట్టుకోలేదు.

ఆ పార్టీ జరిగిన 2 రోజులకే తనకు కరోనా సోకినట్టు ప్రకటించింది ప్రగ్యా. గడిచిన 10 రోజులుగా తనతో టచ్ లోకి వచ్చిన వాళ్లంతా విధిగా పరీక్షలు చేయించుకోవాలని కోరింది. ఈ పార్టీ తర్వాత బాలయ్య, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ లో పాల్గొన్నారు. ఓటు వేశారు. చాలామందితో చాలా క్లోజ్ గా మాట్లాడారు.

Tags:    
Advertisement

Similar News