ఈ హీరో కూడా గూఢచారిగా మారాడు

తెలుగులో గూఢచారి పాత్రలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే అడివి శేష్ గూఢచారిగా కనిపించాడు. తాజాగా రాజా విక్రమార్క సినిమాతో కార్తికేయ కూడా గూఢచారి అయిపోయాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి యంగ్ హీరో నిఖిల్ కూడా చేరాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ స్పై థ్రిల్లర్ స్టార్ట్ చేశాడు ఈ నటుడు. నిఖిల్ కెరీర్‌లో 19వ చిత్రం ఇది. గ్యారీ బీహెచ్ డైరక్టర్. ఇంతకుముందు గూఢచారి, ఎవరు, హిట్ సినిమాలకు ఇతడు ఎడిటర్ గా పని చేశాడు. రెడ్ సినిమాస్ […]

Advertisement
Update:2021-10-09 15:14 IST

తెలుగులో గూఢచారి పాత్రలకు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే అడివి శేష్ గూఢచారిగా కనిపించాడు.
తాజాగా రాజా విక్రమార్క సినిమాతో కార్తికేయ కూడా గూఢచారి అయిపోయాడు. ఇప్పుడీ లిస్ట్ లోకి యంగ్ హీరో నిఖిల్ కూడా చేరాడు. కెరీర్ లో ఫస్ట్ టైమ్ స్పై థ్రిల్లర్ స్టార్ట్ చేశాడు ఈ నటుడు.

నిఖిల్ కెరీర్‌లో 19వ చిత్రం ఇది. గ్యారీ బీహెచ్ డైరక్టర్. ఇంతకుముందు గూఢచారి, ఎవరు, హిట్ సినిమాలకు ఇతడు ఎడిటర్ గా పని చేశాడు. రెడ్ సినిమాస్ ప‌తాకంపై కె.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.

ప్ర‌ముఖ నిర్మాతలు శరత్ మరార్, జెమినీ కిరణ్, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా స్క్రిప్ట్‌ను చిత్రయూనిట్‌కు అందించారు. ముహుర్తం షాట్‌కు గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించగా నిర్మాత రాజశేఖర్ రెడ్డి క్లాప్ కొట్టారు.

నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించేందుకు మేకర్స్
సిద్దమయ్యారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఫిక్స్ కాలేదు.

Tags:    
Advertisement

Similar News