నాగబాబుకు కౌంటర్ ఇచ్చిన మంచు విష్ణు

నాగబాబు, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిన్నటికి నిన్న మంచు విష్ణుకు తెలుగు రాదన్నారు నాగబాబు. ప్రకాష్ రాజ్ కు, మంచు విష్ణుకు తెలుగులో పరీక్ష పెడితే, విష్ణు కనీసం పాస్ అవ్వడని విమర్శించారు. అంతేకాకుండా.. మోహన్ బాబు, ఆమె భార్య మాత్రమే తెలుగోళ్లని.. మంచు విష్ణు అసలు తెలుగోడు కాదని ఆరోపించారు నాగబాబు. వీటన్నింటిపై కొద్దిసేపటి కిందట మంచు విష్ణు రియాక్ట్ అయ్యాడు. తనకు, ప్రకాష్ రాజ్ కు మధ్య తెలుగు పరీక్ష కంటే క్యారెక్టర్ […]

Advertisement
Update:2021-10-09 15:21 IST

నాగబాబు, మంచు విష్ణు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నిన్నటికి నిన్న మంచు విష్ణుకు తెలుగు
రాదన్నారు నాగబాబు. ప్రకాష్ రాజ్ కు, మంచు విష్ణుకు తెలుగులో పరీక్ష పెడితే, విష్ణు కనీసం పాస్ అవ్వడని విమర్శించారు. అంతేకాకుండా.. మోహన్ బాబు, ఆమె భార్య మాత్రమే తెలుగోళ్లని.. మంచు విష్ణు అసలు తెలుగోడు కాదని ఆరోపించారు నాగబాబు.

వీటన్నింటిపై కొద్దిసేపటి కిందట మంచు విష్ణు రియాక్ట్ అయ్యాడు. తనకు, ప్రకాష్ రాజ్ కు మధ్య తెలుగు
పరీక్ష కంటే క్యారెక్టర్ పరీక్ష పెడితే బాగుంటుందని నాగబాబుకు సూచించాడు. “మా” అధ్యక్ష పదవికి తెలుగు కంటే, క్యారెక్టర్ చాలా ముఖ్యమని.. ఆ విషయంలో తనకు ఎన్ని మార్కులొస్తాయో, ఇండస్ట్రీలో అడిగితే ఎవరైనా చెబుతారని అన్నాడు. అదే టైమ్ లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కు ఎన్ని మార్కులొస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలని నాగబాబుకు సూచించారు.

ఇక తను చెన్నైలోనే పుట్టి, అక్కడ పెరిగానని, కాబట్టి తెలుగువాడ్ని కాదంటూ నాగబాబు చేసిన ఆరోపణను
కూడా తిప్పికొట్టాడు విష్ణు. చిన్నప్పట్నుంచి నాగబాబు అంకుల్ కళ్ల ముందే తను పెరిగానని, ఆ విషయాన్ని ఆయన ఒప్పుకోకపోయినా, ఆయన మనసుకు ఆ విషయం తెలుసంటున్నాడు విష్ణు.

Tags:    
Advertisement

Similar News