కొండపొలం మూవీ రివ్యూ

నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోటా శ్రీనివాసరావు, సాయి చంద్, హేమ.. బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంగీతం : ఎంఎం కీరవాణి సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వీఎస్ కథ-మాటలు : సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి ఎడిటర్ : శ్రావన్ కటికనేని నిర్మాత : సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి స్క్రీన్ ప్లే – దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి రేటింగ్: 2.5/5 ఆడియన్స్ టేస్ట్ మారింది. కొత్తగా ఏం […]

Advertisement
Update:2021-10-08 13:24 IST

నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోటా శ్రీనివాసరావు, సాయి చంద్, హేమ..
బ్యానర్ : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్
సంగీతం : ఎంఎం కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జ్ఞాన శేఖర్ వీఎస్
కథ-మాటలు : సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి
ఎడిటర్ : శ్రావన్ కటికనేని
నిర్మాత : సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి
స్క్రీన్ ప్లే – దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి
రేటింగ్: 2.5/5

ఆడియన్స్ టేస్ట్ మారింది. కొత్తగా ఏం చెబుతున్నామనేది ముఖ్యం. క్రిష్ కు ఈ విషయం బాగా తెలుసు.
అందుకే ఈసారి కొండపొలం అనే నవలను ఎంచుకున్నాడు. చిన్నచిన్న మార్పుచేర్పులు చేసినప్పటికీ..
ఉన్నదున్నట్టు సినిమాగా తీసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో నెరేషన్ పై పట్టుకోల్పోయాడు. సినిమా
ఆద్యంతం బాగుంది కానీ, స్లోగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది.

కొండపొలం కాన్సెప్ట్ చాలామందికి కొత్త. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండేవాళ్లకు, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రజలకు మాత్రమే తెలిసిన పద్ధతి ఇది. దీన్ని తెలుగు ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పడంతో పాటు.. ఓ గొర్రెల కాపరి అడవి నుంచి ఏం నేర్చుకున్నాడు, తనను తాను ఎలా మార్చుకున్నాడు అనే అంశాల్ని క్రిష్ ఇందులో చాలా చక్కగా చూపించాడు. ఈ తరం యువకులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సినిమాలో హీరో పాత్ర ద్వారా చాలా స్ఫూర్తి పొందొచ్చు.

డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూసే రవీంద్ర(వైష్ణవ్ తేజ్) అనుకోకుండా వాళ్ళ కుల వృత్తి అయిన గొర్రెల పెంపకం ఎంచుకొని కొండ పొలం చేయడానికి రెడీ అవుతాడు. గొర్రె మందను తీసుకొని ఊరి వాళ్ళతో కలిసి అడవిలోకి వెళ్లిన రవీంద్ర అడవి గురించి, అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకుంటాడు. ఈ క్రమంలో తనతో కలిసి కొండపొలం చేయడానికి వచ్చిన ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. ఓబులమ్మ కూడా తనని ఇష్టపడుతుంది. ఇక అడవిలో పులుల నుండి అలాగే జనాల నుండి తమ గొర్రెలను రవీంద్ర ఎలా కాపాడుకున్నాడు..? ఫైనల్ గా అడవిలో జీవితం గురించి తెలుసుకున్న రవీంద్ర ఎట్టకేలకు IFS ఆఫీసర్ గా ఎలా ఎదిగాడు అనేది కథ.

పుస్తకరూపంలో ఉన్న ఈ కథను వెండితెరపైకి తీసుకురావడంలో క్రిష్ నూటికి 90శాతం సక్సెస్ అయ్యాడు.
పుస్తకంలో ఉన్న నేటివిటీ, ఫీల్, యాస.. ఇలా చాలా ఎలిమెంట్స్ ను సినిమాలోకి కూడా చొప్పించాడు. ఒక దర్శకుడిగా క్రిష్ ఎంత సమర్థుడనే విషయం ఈ సినిమాను చూస్తే అర్థమౌతుంది. ఎక్కడా గాడి తప్పకుండా సినిమాను నడిపిస్తూనే, పుస్తకంలో లేని ఓబులమ్మ పాత్రను తెరపై సృష్టించి, హీరోతో రొమాన్స్ పండించి, కమర్షియల్ టచ్ కూడా ఇచ్చాడు. దీంతోపాటు అడవిలో తీసిన సన్నివేశాల్లో క్రిష్ టాలెంట్ ఎలివేట్ అవుతుంది.

నటీనటుల విషయానికొస్తే.. రవీంద్ర యాదవ్ గా వైష్ణవ్ తేజ్ చక్కగా నటించాడు. మొదటి సినిమా
ఉప్పెనతోనే తన టాలెంట్ చూపించిన ఈ మెగా కుర్రాడు.. కొండపొలంతో నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు.ఇక ఓబులమ్మ పాత్ర పోషించిన రకుల్ ప్రీత్.. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. సినిమాలో ఆమెను పెద్దగా మేకప్ లేకుండానే చూపించాడు క్రిష్. సాయిచంద్, హేమ, మహేష్, కోట తన పాత్రలకు తగ్గట్టు నటించారు.

టెక్నికల్ గా కూడా సినిమా బాగుంది జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ మెయిన్ హైలెట్ కాగా.. కీరవాణి మ్యూజిక్
మరో మేజర్ హైలెట్ గా నిలిచింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి అందించిన డైలాగ్స్ బాగున్నాయి.

పల్లెటూరు, అటవీ నేపథ్యం నుంచి వచ్చిన హీరో ఉద్యోగం సంపాదించడానికి చాలా కష్టపడతాడు. నాలుగేళ్ల పాటు ఇంటర్వ్యూలు ఎదుర్కొంటూనే ఉంటాడు. కానీ ఉద్యోగం రాదు. ఓవైపు ఇంగ్లిష్ రాదనే ఆత్మన్యూనతతో, ఆత్మవిశ్వాసం లోపించి, ఇక కులవృత్తి అయిన గొర్రెల పెంపకం వైపు వెళ్తాడు. ఎప్పుడైతే కొండపొలం కోసం అడవిలోకి ఎంటర్ అవుతాడో, అప్పుడు తనలోని శక్తిని తెలుసుకుంటాడు. ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటాడు. ఈ విషయాలన్నీ చెప్పడానికి దర్శకుడు చాలా టైమ్ తీసుకున్నాడు. కథ నెమ్మదిగా సాగడానికి కూడా ఇదే కారణం. సెకండాఫ్ నుంచి క్రిష్ తన మేజిక్ చూపించాడు. కథను పరుగులు పెట్టించాడు.

అన్నీ బాగున్నప్పటికీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు స్లో నెరేషన్ వల్ల ఈ సినిమా కాస్త ఇబ్బంది పెడుతుంది. దీనికితోడు కరువు పరిస్థితుల్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కూడా క్రిష్ ఫెయిల్ అయ్యాడు. సినిమా మొత్తం పచ్చదనం కనిపిస్తుంటే, కరువు ఎక్కడుంది అనే అనుమానం కలుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న లోపాలు తప్పిస్తే, కొండపొలం సినిమా కచ్చితంగా చూడదగ్గ మూవీగా నిలుస్తుంది. మరీ ముఖ్యంగా యువత ఈ సినిమాను తప్పక చూడాలి.

Tags:    
Advertisement

Similar News