విలన్ రోల్స్ పై స్పందించిన ముద్దుగుమ్మ

అందంగా కనిపిస్తుంది. గ్లామర్ డోస్ కూడా పెంచగలదు. ఏ హీరో పక్కనైనా ఇట్టే సెట్ అయిపోతుంది. ఇలాంటి ముద్దుగుమ్మ విలన్ పాత్ర పోషిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ప్రశ్న శృతిహాసన్ కు ఎదురైంది. నెగెటివ్ రోల్స్ చేస్తే చూడాలని ఉందంటూ ఓ నెటిజన్, శృతిహాసన్ ను కోరాడు. దీనిపై ఆమె అంతే పాజిటివ్ గా స్పందించింది. సినిమాలో నెగెటివ్ పాత్ర చేయాలనే కోరిక తనకు కూడా ఉందని ప్రకటించింది శృతిహాసన్. అయితే ఏదో చేయాలని చేయకూడదని అంటోంది. తన పాత్ర సినిమాలో […]

Advertisement
Update:2021-10-05 12:46 IST

అందంగా కనిపిస్తుంది. గ్లామర్ డోస్ కూడా పెంచగలదు. ఏ హీరో పక్కనైనా ఇట్టే సెట్ అయిపోతుంది. ఇలాంటి ముద్దుగుమ్మ విలన్ పాత్ర పోషిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే ప్రశ్న శృతిహాసన్ కు ఎదురైంది. నెగెటివ్ రోల్స్ చేస్తే చూడాలని ఉందంటూ ఓ నెటిజన్, శృతిహాసన్ ను కోరాడు. దీనిపై ఆమె అంతే పాజిటివ్ గా స్పందించింది.

సినిమాలో నెగెటివ్ పాత్ర చేయాలనే కోరిక తనకు కూడా ఉందని ప్రకటించింది శృతిహాసన్. అయితే ఏదో చేయాలని చేయకూడదని అంటోంది. తన పాత్ర సినిమాలో అత్యంత కీలకంగా ఉండడంతో పాటు.. అన్నీ రకాలుగా కలిసొచ్చినప్పుడు మాత్రమే విలన్ రోల్స్ లో నటిస్తానని క్లారిటీ ఇచ్చింది. అలాంటి సమయం వచ్చినప్పుడు, అలాంటి రోల్ దొరికినప్పుడు నెగెటివ్ గా కనిపించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేసింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ సరసన సలార్ సినిమా చేస్తోంది. ఓవైపు సినిమా చేస్తూనే, మరోవైపు
మ్యూజిక్ బ్యాండ్ పనులు కూడా చూసుకుంటోంది. ఈసారి తన మ్యూజిక్ బ్యాండ్ కోసం లోకల్ టాలెంట్ ను వెదికే పనిలో ఉన్నానని తెలిపింది.

Tags:    
Advertisement

Similar News