మరో మూవీ ప్రకటించబోతున్న ప్రభాస్

ఇప్పటికే ప్రభాస్ చేతిలో సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కె సినిమాలున్నాయి. ఇవి పూర్తయ్యేసరికే దాదాపు రెండేళ్లు పట్టేలా ఉంది. ఇవి కాకుండా ఇప్పుడు మరో సినిమా కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. కెరీర్ లో తన 25వ చిత్రాన్ని ప్రకటించబోతున్నాడు ప్రభాస్. 25వ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 7న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా […]

Advertisement
Update:2021-10-04 15:54 IST

ఇప్పటికే ప్రభాస్ చేతిలో సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్-కె సినిమాలున్నాయి. ఇవి పూర్తయ్యేసరికే దాదాపు
రెండేళ్లు పట్టేలా ఉంది. ఇవి కాకుండా ఇప్పుడు మరో సినిమా కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నాడు ప్రభాస్. కెరీర్ లో తన 25వ చిత్రాన్ని ప్రకటించబోతున్నాడు ప్రభాస్.

25వ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోతున్నాడు యంగ్ రెబల్ స్టార్. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 7న ఈ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి.

ప్రస్తుతం రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే హిందీ సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత, పూర్తిగా ప్రభాస్ మూవీపైనే ఫోకస్ పెట్టబోతున్నాడు. మరి మహేష్ తో ఈ దర్శకుడు ఎప్పుడు సినిమా చేస్తాడో చూడాలి.

Tags:    
Advertisement

Similar News