ధనుష్ భార్య కూడా తెలుగులోకి వస్తోంది

ధనుష్ టాలీవుడ్ లో ఎంట్రీకి రెడీ అయ్యాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పుడు ధనుష్ భార్య, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కూడా టాలీవుడ్ పై కన్నేసింది. తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమాను డైరక్ట్ చేయబోతోంది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె, హీరో ధనుష్‌ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై స్ట్రయిట్‌ తెలుగు సినిమా నిర్మించనుంది. ధనుష్‌ హీరోగా నటించిన తమిళ సినిమా ‘3’తో ఐశ్వర్య దర్శకురాలిగా పరిచయమైంది. తెలుగులో కూడా ఆ సినిమా విడుదలైంది. […]

Advertisement
Update:2021-10-03 10:56 IST

ధనుష్ టాలీవుడ్ లో ఎంట్రీకి రెడీ అయ్యాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు. ఇప్పుడు ధనుష్ భార్య, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య కూడా టాలీవుడ్ పై కన్నేసింది. తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమాను డైరక్ట్ చేయబోతోంది.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుమార్తె, హీరో ధనుష్‌ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై
స్ట్రయిట్‌ తెలుగు సినిమా నిర్మించనుంది. ధనుష్‌ హీరోగా నటించిన తమిళ సినిమా ‘3’తో ఐశ్వర్య
దర్శకురాలిగా పరిచయమైంది. తెలుగులో కూడా ఆ సినిమా విడుదలైంది. ఆ తర్వాత ‘వెయ్‌ రాజా వెయ్‌’
చేసింది. ఇప్పుడు దర్శకురాలిగా మూడో సినిమా, తెలుగులో చేయడానికి ఐశ్వర్య ధనుష్‌ సిద్ధమవుతోంది.

భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్‌ సినిమా… రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌ నటించిన ‘2.0’ను లైకా
ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. అదొక్కటే కాదు. ఇంకా పలు భారీ బడ్జెట్‌, హిట్‌ చిత్రాలను ప్రేక్షకులకు
అందించింది. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న ‘రామ్‌ సేతు’తో హిందీ పరిశ్రమలోకి ప్రవేశిస్తోంది. జాన్వీ
కపూర్‌ కథానాయికగా ‘గుడ్‌ లక్‌ జెర్రీ’ నిర్మిస్తోంది. హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాలు నిర్మిస్తోంది. ఇప్పుడుతెలుగు చలనచిత్ర పరిశ్రమలో సినిమా చేయడానికి లైకా ప్రొడక్షన్స్‌ సిద్ధమైంది. ఐశ్వర్య ధనుష్ తీయబోయే సినిమా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

Tags:    
Advertisement

Similar News