కొండపొలంలో రొమాన్స్
కొండపొలం సినిమాలో కేవలం యాక్షన్, డ్రామా మాత్రమే కాదు. ఈ సినిమాలో రొమాన్స్ కూడా ఉంది. వైష్ణవ్ తేజ్, రకుల్ మధ్య మంచి ముద్దు సీన్లు కూడా ఉన్నాయి. దీనికి సాక్ష్యంగా నిలిచింది శ్వాస సాంగ్. ఈరోజు ఈ పాటను విడుదల చేశారు మేకర్స్. ఈ రోజు కొండపొలం సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రిలీజైంది. స్వరవాణి ఎంఎం కీరవాణి మార్క్ చూపించే రొమాంటిక్ మెలోడి గీతమిది. ఈ పాటకు కీరవాణి సాహిత్యాన్ని కూడా అందించడం విశేషం. ఆయన సాహిత్యం, బాణీ ఇప్పుడు […]
కొండపొలం సినిమాలో కేవలం యాక్షన్, డ్రామా మాత్రమే కాదు. ఈ సినిమాలో రొమాన్స్ కూడా ఉంది. వైష్ణవ్ తేజ్, రకుల్ మధ్య మంచి ముద్దు సీన్లు కూడా ఉన్నాయి. దీనికి సాక్ష్యంగా నిలిచింది శ్వాస సాంగ్. ఈరోజు ఈ పాటను విడుదల చేశారు మేకర్స్.
ఈ రోజు కొండపొలం సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రిలీజైంది. స్వరవాణి ఎంఎం కీరవాణి మార్క్ చూపించే రొమాంటిక్ మెలోడి గీతమిది. ఈ పాటకు కీరవాణి సాహిత్యాన్ని కూడా అందించడం విశేషం. ఆయన సాహిత్యం, బాణీ ఇప్పుడు అందరినీ కట్టిపడేస్తోంది. వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కెమిస్ట్రీని మరో లెవెల్‌లో చూపించారు. యామిని ఘంటసాల, రోహిత్ ఈ పాటను శ్రావ్యంగా ఆలపించారు. ఈ పాట మరో సూపర్ హిట్ సాంగ్‌గా నిలిచిపోనుంది.
ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రం 'కొండపొలం'తో
అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్
సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.