సాయిధరమ్ తేజ్ మాట తీసుకున్నాడు
ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది రిపబ్లిక్ సినిమా. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు దర్శకుడు దేవ కట్టా. సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ దర్శకుడు.. రిపబ్లిక్ కథను తను మాత్రమే చేస్తానని, వేరే హీరోను సంప్రదించొద్దని సాయితేజ్ తన నుంచి మాట తీసుకున్నాడనే విషయాన్ని బయటపెట్టాడు. “సాధారణంగా రాజకీయ నాయకులకు, ప్రజలకు మధ్య అన్వయకర్తగా ఉండే ఓ బ్యూరోక్రట్ నిజాయతీగా ఉన్నప్పుడు, […]
ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది రిపబ్లిక్ సినిమా. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ
సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు దర్శకుడు దేవ కట్టా. సినిమా ప్రచారంలో
భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ దర్శకుడు.. రిపబ్లిక్ కథను తను మాత్రమే చేస్తానని, వేరే హీరోను
సంప్రదించొద్దని సాయితేజ్ తన నుంచి మాట తీసుకున్నాడనే విషయాన్ని బయటపెట్టాడు.
“సాధారణంగా రాజకీయ నాయకులకు, ప్రజలకు మధ్య అన్వయకర్తగా ఉండే ఓ బ్యూరోక్రట్ నిజాయతీగా
ఉన్నప్పుడు, తను వ్యవస్థను ఎలా చూస్తున్నాడు, తన ఆలోచనల వల్ల తన ప్రయాణం ఎలా సాగింది, అనే
పాయింట్‌తో ఈ కథను తయారు చేశాను. సాయితేజ్ ఓ కామన్ మ్యాన్‌గా ఈ కథకు రిలేట్ అయ్యాడు. ఈ
డిస్ట్రబెన్స్ నుంచి వచ్చిన ఐడియాలో నిజం ఉంది. ఈ కథను నేనే చేయాలి అనుకున్నాడు. ఈ ఆలోచనను కథగా రాయక ముందే నాతోనే ఈ సినిమా చేయాలని తేజ్ ప్రామిస్ తీసుకున్నాడు.”
అలా సాయితేజ్ కు ప్రామిస్ చేసిన తర్వాత రిపబ్లిక్ కథ రాశానంటున్నాడు దేవకట్టా. హీరోను దృష్టిలో
పెట్టుకొని ఈ కథ రాయలేదని, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని రాశానంటున్నాడు. రమ్యకృష్ణ, జగపతిబాబు
కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా అక్టోబర్ 1న థియేటర్లలోకి వస్తోంది.