నాగశౌర్య నుంచి ఒకేసారి 2 సినిమాలు

నిన్ననే తన కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించాడు నాగశౌర్య. అంతలోనే మరో సినిమా రిలీజ్ డేట్ తో ముందుకొచ్చాడు. వరుడు కావలెను సినిమాను దసరా బరిలో నిలిపిన ఈ హీరో, ఆ సినిమా వచ్చిన నెల రోజులకే లక్ష్య సినిమాను కూడా థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడు. ఈ మేరకు ఈరోజు అధికారిక ప్రకటనతో పాటు బ్రాండ్ న్యూ పోస్టర్ కూడా వచ్చేసింది. నాగశౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా రూపొందుతోంది `లక్ష్య`. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రంలో నాగశౌర్య సరసన […]

Advertisement
Update:2021-09-27 14:13 IST

నిన్ననే తన కొత్త సినిమా విడుదల తేదీని ప్రకటించాడు నాగశౌర్య. అంతలోనే మరో సినిమా రిలీజ్ డేట్ తో ముందుకొచ్చాడు. వరుడు కావలెను సినిమాను దసరా బరిలో నిలిపిన ఈ హీరో, ఆ సినిమా వచ్చిన నెల
రోజులకే లక్ష్య సినిమాను కూడా థియేటర్లలోకి తీసుకురాబోతున్నాడు. ఈ మేరకు ఈరోజు అధికారిక ప్రకటనతో పాటు బ్రాండ్ న్యూ పోస్టర్ కూడా వచ్చేసింది.

నాగశౌర్య కెరీర్‌లో 20వ చిత్రంగా రూపొందుతోంది 'లక్ష్య'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రంలో నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ సినిమా రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను నవంబర్ 12న రిలీజ్ చేయబోతున్నారు.

ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన పోస్ట‌ర్‌లో షర్ట్ లేకుండా నాగశౌర్య డిఫ‌రెంట్ గెట‌ప్‌లో క‌నిపించాడు. ఆయన
హెయిర్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. ఇక కండలు తిరిగిన దేహంతో నాగశౌర్య లుక్ బాగుంది. విలువిద్యలో
ఆరితేరిన ఆటగాడిగా ఈ సినిమాలో నాగ‌శౌర్య ఇదివ‌ర‌కెన్న‌డూ చూడ‌ని లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో నాగశౌర్య రెండు విభిన్నమైన గెటప్పుల్లో కనిపించబోతోన్నాడు.

Tags:    
Advertisement

Similar News