సాయితేజ్ కెరీర్ బెస్ట్ అవుతుందట
అక్టోబర్ 1న గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది రిపబ్లిక్ సినిమా. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఐశ్వర్యరాజేష్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో సాయితేజ్ కు సంబంధించి చాలా ఆసక్తికర విశేషాల్ని బయటపెట్టింది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. క్లైమాక్స్ లో 10 నిమిషాల సీన్ ను సింగిల్ టేక్ లో చేశాడట సాయితేజ్. “సాయితేజ్ ఓ జెమ్. ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. సినిమాలో ప్రజలు తరపున మాట్లాడే పాత్రలో తను నటించాడు. […]
అక్టోబర్ 1న గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది రిపబ్లిక్ సినిమా. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ
సినిమాలో ఐశ్వర్యరాజేష్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో సాయితేజ్ కు సంబంధించి చాలా ఆసక్తికర
విశేషాల్ని బయటపెట్టింది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. క్లైమాక్స్ లో 10 నిమిషాల సీన్ ను సింగిల్ టేక్ లో చేశాడట సాయితేజ్.
“సాయితేజ్ ఓ జెమ్. ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. సినిమాలో ప్రజలు తరపున మాట్లాడే పాత్రలో
తను నటించాడు. సినిమా షూటింగ్‌కు వెళ్లడానికి ముందుగానే నేను యూనిట్‌ను కలిశాను. నేను, తేజ్,
దేవకట్టాగారు.. ఇలా అందరూ డిస్కస్ చేశాం. తేజ్ ప్రతిరోజూ స్కూల్‌కు వెళ్లే పిల్లాడిలా ఉదయం
పదిన్నరకంతా వచ్చేవాడు. ఓ బుక్ పెట్టుకుని అందులో డైలాగ్స్ రాసుకుని ప్రాక్టీస్ చేసేవాడు. ఎంత
కష్టపడ్డారంటే ఇందులో కోర్టు రూమ్ సీన్ ఉంది. పది నిమిషాల పాటు సాగే ఆ సీన్‌ను తేజ్ సింగిల్ టేక్‌లో
చేశాడు. ఆ సీన్ తర్వాత యూనిట్ అందరూ క్లాప్స్ కొట్టారు. తన కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని నేను
భావిస్తున్నాను.”
ఇలా రిపబ్లిక్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టింది ఐశ్వర్యరాజేష్. ఈ సినిమాలో తను పోషించిన మైరా పాత్రను దర్శకుడు దేవ కట్టా 5 గంటల పాటు నెరేట్ చేశాడని చెప్పుకొచ్చింది ఐశ్వర్య. తన పాత్రలో అంత డెప్త్ ఉందంటోంది.