ఏపీ కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై మంత్రి బాలినేని కీలక వ్యాఖ్యలు..
మంత్రి వర్గ విస్తరణ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్చేస్తానంటూ కేబినెట్ కూర్పు రోజే సీఎం జగన్ హింట్ ఇచ్చారు. ఆ సమయం దగ్గరపడుతుండే సరికి ఏపీలో హడావిడి మొదలైంది. పాతవారిలో ఎంతమందికి స్థాన చలనం ఉంటుంది, కొత్తగా ఎవరెవరిని తీసుకుంటారని లెక్కలు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ మంత్రివర్గ మార్పులు చేర్పులపై పెద్ద స్థాయి నేతలెవరూ నేరుగా స్పందించలేదు. తొలిసారిగా మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మంత్రి వర్గ పునర్ […]
మంత్రి వర్గ విస్తరణ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గాన్ని మార్చేస్తానంటూ కేబినెట్ కూర్పు రోజే సీఎం జగన్ హింట్ ఇచ్చారు. ఆ సమయం దగ్గరపడుతుండే సరికి ఏపీలో హడావిడి మొదలైంది. పాతవారిలో ఎంతమందికి స్థాన చలనం ఉంటుంది, కొత్తగా ఎవరెవరిని తీసుకుంటారని లెక్కలు వేస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ మంత్రివర్గ మార్పులు చేర్పులపై పెద్ద స్థాయి నేతలెవరూ నేరుగా స్పందించలేదు. తొలిసారిగా మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై పెదవి విప్పారు.
అంతా కొత్తవారే..
మంత్రివర్గంలో మార్పులు చేసేందుకు జగన్ నిర్ణయించారని, దీనికి సంబంధించి ఇటీవల తనతో మాట్లాడారని అన్నారు బాలినేని. అంతా కొత్తవారినే తీసుకునే ఉద్దేశంలో ఉన్నట్టు జగన్ తనకు చెప్పారని అన్నారు. ఆ పాలసీ అమలు చేస్తే.. తనని కూడా మార్చేయాలని జగన్ కు సూచించినట్టు తెలిపారు. మంత్రి పదవి లేకపోతే తానేమీ భయపడనని, పార్టీకి కట్టుబడి ఉంటానని అన్నారు. మంత్రివర్గంలో వందశాతం మార్పులు జరగబోతున్నట్టు చెప్పారు బాలినేని.
రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు..
మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణపై ఇప్పటి వరకూ కీలక నేతలెవరూ నోరు మెదపలేదు. తొలిసారిగా మంత్రి బాలినేని దీనిపై స్పందించడంతో రాజకీయ వర్గాల్లో ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకవేళ వందశాతం కొత్తవారికి అవకాశం ఇస్తే.. కచ్చితంగా సీఎం జగన్ నిర్ణయం మరింత సంచలనంగా మారుతుంది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రయోగం జరగలేదు. సగం పరిపాలన తర్వాత మంత్రివర్గాన్ని పూర్తిగా మార్చేసే సంప్రదాయానికి జగనే ఆద్యుడవుతారు.