సాయిపల్లవి నుంచి మరో వెబ్ సిరీస్

ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. మంచి కథలు దొరికితే వెబ్ సిరీస్/ఒరిజినల్ మూవీస్ లో కూడా నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది సాయిపల్లవి. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే మరో ఓటీటీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొస్తానని చెబుతోంది. “ప్రస్తుతం నేను తెలుగులో విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటిస్తున్నాను. విరాటపర్వం కేవలం ఒక రోజు షూటింగ్ మాత్రం ఉంది. శ్యామ్ సింగరాయ్ కూడా చివరి దశలో ఉంది. తమిళంలో ఒకటి, మలయాళంలో […]

Advertisement
Update:2021-09-23 15:33 IST

ఓవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. మంచి కథలు దొరికితే వెబ్ సిరీస్/ఒరిజినల్ మూవీస్ లో కూడా నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోంది సాయిపల్లవి. ఇందులో భాగంగా ఇప్పటికే ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే మరో ఓటీటీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకొస్తానని చెబుతోంది.

“ప్రస్తుతం నేను తెలుగులో విరాటపర్వం, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో నటిస్తున్నాను. విరాటపర్వం కేవలం ఒక రోజు షూటింగ్ మాత్రం ఉంది. శ్యామ్ సింగరాయ్ కూడా చివరి దశలో ఉంది. తమిళంలో ఒకటి, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను. తెలుగులో మరో సినిమా, వెబ్ సిరీస్ కు సంప్రదింపులు జరుగుతున్నాయి.”

ఇలా తన అప్ కమింగ్ మూవీస్ తో పాటు వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు ప్రకటించింది సాయిపల్లవి. ఆమె నటించిన లవ్ స్టోరీ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. ఫిదాలో చేసిన భానుమతి పాత్రకు, లవ్ స్టోరీలో చేసిన మౌనిక పాత్రకు ఎలాంటి పోలికలు ఉండవంటోంది ఈ బ్యూటీ.

Tags:    
Advertisement

Similar News