లాక్ డౌన్ కలిసొచ్చింది: నాగచైతన్య

లాక్ డౌన్ లో చాలామంది చాలా కష్టాలు పడ్డారు. హీరోల నుంచి సినీ కార్మికుల వరకు అంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నాగచైతన్య మాత్రం తనకు లాక్ డౌన్ కలిసొచ్చిందని చెబుతున్నాడు. లవ్ స్టోరీలో పాత్రను పండించడానికి లాక్ డౌన్ టైమ్ బాగా పనికొచ్చిందంటున్నాడు. “ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడతాను. ఈ యాస కోసం కొన్ని రోజుల పాటు ప్రాక్టిస్ సెషన్స్ చేశాము. ఇక డబ్బింగ్ చెప్పే టైమ్ కు లాక్ డౌన్ వచ్చి, ఈ యాస […]

Advertisement
Update:2021-09-23 15:36 IST

లాక్ డౌన్ లో చాలామంది చాలా కష్టాలు పడ్డారు. హీరోల నుంచి సినీ కార్మికుల వరకు అంతా ఇబ్బందులు
ఎదుర్కొన్నారు. అయితే నాగచైతన్య మాత్రం తనకు లాక్ డౌన్ కలిసొచ్చిందని చెబుతున్నాడు. లవ్ స్టోరీలో పాత్రను పండించడానికి లాక్ డౌన్ టైమ్ బాగా పనికొచ్చిందంటున్నాడు.

“ఈ సినిమాలో నేను తెలంగాణ యాసలో మాట్లాడతాను. ఈ యాస కోసం కొన్ని రోజుల పాటు ప్రాక్టిస్ సెషన్స్ చేశాము. ఇక డబ్బింగ్ చెప్పే టైమ్ కు లాక్ డౌన్ వచ్చి, ఈ యాస మరింత స్పష్టంగా నేర్చుకునేందుకు వీలు దొరికింది.”

నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చైతూ, పై విధంగా స్పందించాడు. తన సినిమాను అమీర్ ఖాన్ కు చూపించే ప్రయత్నం చేస్తానంటున్నాడు.

“మంచి కథలు దొరికితే ఇతర భాషల్లో నటిస్తాను. అమీర్ ఖాన్ గారితో లాల్ సింగ్ చద్దా లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ప్రీ రిలీజ్ కు వచ్చి మా సినిమా గురించి బాగా చెప్పారు. ఆయన అపాయింట్ మెంట్ కోసం చూస్తున్నాం. దొరికితే లవ్ స్టోరి సినిమాను చూపిస్తాం.”

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కింది లవ్ స్టోరీ సినిమా. సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది.

Tags:    
Advertisement

Similar News