డానియర్ శేఖర్ అదరగొట్టాడు

“రేయ్ డానీ.. బయటకు రారా నా కొడకా” అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. భీమ్లానాయక్ లో పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ వీడియో కింద ఈ పవర్ ఫుల్ డైలాగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడా డైలాగ్ కు కొనసాగింపుగా.. డానీ బయటకొచ్చాడు. అంటే.. రానా ఫస్ట్ లుక్ అన్నమాట. పవన్ డైలాగ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా రానాతో కూడా డైలాగ్ చెప్పించారు. ప్రస్తుతం రానా ఫస్ట్ లుక్ వీడియో సోషల్ మీడియాలో […]

Advertisement
Update:2021-09-21 14:58 IST

“రేయ్ డానీ.. బయటకు రారా నా కొడకా” అంటూ పవన్ కల్యాణ్ చెప్పిన డైలాగ్ ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. భీమ్లానాయక్ లో పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ వీడియో కింద ఈ పవర్ ఫుల్ డైలాగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడా డైలాగ్ కు కొనసాగింపుగా.. డానీ బయటకొచ్చాడు. అంటే.. రానా ఫస్ట్ లుక్ అన్నమాట.

పవన్ డైలాగ్ కు ఏమాత్రం తీసిపోని విధంగా రానాతో కూడా డైలాగ్ చెప్పించారు. ప్రస్తుతం రానా ఫస్ట్ లుక్
వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట..? స్టేషన్ లో టాక్
నడుస్తోంది… నేనెవరో తెలుసా ధర్మేంద్ర … హీరో ..హీరో..!” అంటూ రానా చెప్పిన డైలాగ్ ఇనిస్టెంట్ గా హిట్ అయింది.

ఈ రెండు టీజర్లు కలిపి చూస్తే.. భీమ్లానాయక్ లో పవన్-రానా మధ్య వచ్చే సన్నివేశాలు ఓ రేంజ్ లో
ఉండబోతున్నాయనే విషయం అర్థమౌతూనే ఉంది. ఈ రెండు వీడియోలతో భీమ్లానాయక్ పై అంచనాలు
రెట్టింపు అయ్యాయి.

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్యామీనన్ హీరోయిన్. 2022 జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

Full View

Tags:    
Advertisement

Similar News