దసరాకు పెళ్లిసందడి రాబోతోంది

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపించిన ఈయ‌న ‘పెళ్లిసంద‌D’ లో న‌టుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర‌రావు అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మూవీని ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ పొందింది. సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ […]

Advertisement
Update:2021-09-21 15:03 IST

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఎన్నో
బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపించిన ఈయ‌న ‘పెళ్లిసంద‌D’ లో న‌టుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర‌రావు అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మూవీని ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు.

ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ పొందింది. సినిమాను ద‌స‌రా
సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లిసంద‌డి'లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్న ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో. శ్రీలీల హీరోయిన్‌ గా పరిచయమౌతోంది.

రీసెంట్‌గా నాగార్జున విడుద‌ల చేసిన టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇదే ఊపులో
మహేష్ బాబు చేతుల మీదుగా ట్రయిలర్ లాంఛ్ చేశారు.

Tags:    
Advertisement

Similar News