ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్ గా చెర్రీ

ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. మాస్ట్రో, టక్ జగదీశ్ లాంటి పెద్ద సినిమాలు కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. పైగా తెలుగుల ఓటీటీకి చాలా పెద్ద మార్కెట్ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో తెలుగుపై ఫోకస్ పెట్టింది డిస్నీ హాట్ స్టార్ సంస్థ. ఈ మేరకు తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ ను నియమించింది. డిస్నీ హాట్ స్టార్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. […]

Advertisement
Update:2021-09-18 16:52 IST

ప్రస్తుతం ఓటీటీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. మాస్ట్రో, టక్ జగదీశ్ లాంటి పెద్ద సినిమాలు కూడా
నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. పైగా తెలుగుల ఓటీటీకి చాలా పెద్ద మార్కెట్ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో తెలుగుపై ఫోకస్ పెట్టింది డిస్నీ హాట్ స్టార్ సంస్థ. ఈ మేరకు తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ ను నియమించింది.

డిస్నీ హాట్ స్టార్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించబోతున్నారు. మన వినోద విశ్వం అనే ట్యాగ్‌లైన్‌తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్‌ను ప్రమోట్ చేయనున్నారు.

తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించేందుకు, అలరించేందుకు డిస్నీ హాట్ స్టార్ అన్ని రకాలుగా ప్రణాళికలను సిద్దం చేసింది. టాలీవుడ్ టాప్ స్టార్‌ హీరోల సినిమా హక్కులను సొంతం చేసుకుంది. ఇక జాతీయ, అంతర్జాతీయ స్థాయి చిత్రాలను కూడా తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. అంతేకాకుండా ఐపిఎల్, టీ20 వరల్డ్ కప్ ను కూడా తెలుగు వారికి అందిస్తోంది.

ఈ ఎండోర్స్ మెంట్ కోసం చరణ్ భారీ మొత్తం తీసుకున్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఏడాదికి 5 కోట్ల నుంచి 7 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు డిస్నీ సంస్థ ముందుకొచ్చినట్టు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News