ఈ వీకెండ్ 7 సినిమాలు
ఎప్పట్లానే ఈ వీకెండ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓవైపు ఓటీటీ స్ట్రీమింగ్ ట్రెండ్ నడుస్తూనే, మరోవైపు థియేట్రికల్ రిలీజ్ లు కొనసాగుతున్నాయి. గత వారం ఎలాగైతే టక్ జగదీష్ ఓటీటీలో, సీటీమార్ థియేటర్లలో వచ్చిందో.. ఈవారం కూడా అదే ట్రెండ్ నడుస్తోంది. రేపు నితిన్ నటించిన మాస్ట్రో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. దీనికి పోటీగా సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. రేపు రిలీజ్ అవుతున్న సినిమాల్లో ప్రధానంగా […]
ఎప్పట్లానే ఈ వీకెండ్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఓవైపు ఓటీటీ స్ట్రీమింగ్ ట్రెండ్ నడుస్తూనే, మరోవైపు థియేట్రికల్ రిలీజ్ లు కొనసాగుతున్నాయి. గత వారం ఎలాగైతే టక్ జగదీష్ ఓటీటీలో, సీటీమార్ థియేటర్లలో వచ్చిందో.. ఈవారం కూడా అదే ట్రెండ్ నడుస్తోంది.
రేపు నితిన్ నటించిన మాస్ట్రో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. దీనికి పోటీగా సందీప్ కిషన్ నటించిన గల్లీ రౌడీ సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. రేపు రిలీజ్ అవుతున్న సినిమాల్లో ప్రధానంగా పోటీ ఈ రెండు సినిమాల మధ్యే కనిపిస్తోంది. మిగతావన్నీ దాదాపు చిన్న సినిమాలే.
మాస్ట్రో, గల్లీ రౌడీతో పాటు ప్లాన్-బి అనే సినిమా వస్తోంది. శ్రీనివాసరెడ్డి ఇందులో హీరో. ఈ మూవీతో పాటు
విజయ్ ఆంటోనీ నటించిన విజయ్ రాఘవన్ సినిమా కూడా వస్తోంది. అటు జెమ్, హనీట్రాప్, మరో ప్రస్థానం అనే సినిమాలు కూడా రేపే థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.