నాగ్ మూవీకి కొత్త హీరోయిన్ కావాలి

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమాకు ది ఘోస్ట్ అనే టైటిల్ పెట్టారు. కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. టైటిల్ పోస్టర్ ను కూడా కాజల్ చేతుల మీదుగానే లాంఛ్ చేశారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు కాజల్ ను తప్పించే ఆలోచనలో ఉన్నారు. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటోంది యూనిట్. అవును.. నాగ్ సినిమాలో కొత్త హీరోయిన్ కోసం అప్పుడే అన్వేషణ మొదలైంది. […]

Advertisement
Update:2021-09-16 14:09 IST

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమాకు ది ఘోస్ట్ అనే టైటిల్ పెట్టారు. కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. టైటిల్ పోస్టర్ ను కూడా కాజల్ చేతుల మీదుగానే లాంఛ్ చేశారు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు కాజల్ ను తప్పించే ఆలోచనలో ఉన్నారు. ఆమె స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకోవాలనుకుంటోంది యూనిట్.

అవును.. నాగ్ సినిమాలో కొత్త హీరోయిన్ కోసం అప్పుడే అన్వేషణ మొదలైంది. దీనికి కారణం కాజల్ గర్భవతి కావడమే అని తెలుస్తోంది. కాజల్ గర్భవతి అయిందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా ఇప్పుడు నాగ్ సినిమా నుంచి ఆమె తప్పుకుంది.

అయితే ఆచార్య సినిమాను మాత్రం ఆమె పూర్తిచేసింది. ఈ సినిమాకు సంబంధించి ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉండగా.. ఆ పనిని తాజాగా పూర్తిచేసింది కాజల్. అటు తమిళ్ లో ఒప్పుకున్న మరో సినిమా నుంచి కూడా కాజల్ తప్పుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంతకీ ఆమె నిజంగానే గర్భవతా కాదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

Tags:    
Advertisement

Similar News