ఎట్టకేలకు మొదలైన లైగర్ షూటింగ్

విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ‘సాలా క్రాస్‌బీడ్‌’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ రోజు గోవాలో లైగర్‌ నెక్ట్స్‌ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ షెడ్యూల్ లో చిత్రంలోని మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. బ్లడ్..స్వెట్… వైలెన్స్ #లైగ‌ర్ షూటింగ్ తిరిగి ప్రారంభం అని […]

Advertisement
Update:2021-09-15 14:44 IST

విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా ‘సాలా క్రాస్‌బీడ్‌’ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ రోజు గోవాలో లైగర్‌ నెక్ట్స్‌ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ చేశారు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ షెడ్యూల్ లో చిత్రంలోని మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ ఫైట్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు.

బ్లడ్..స్వెట్… వైలెన్స్ #లైగ‌ర్ షూటింగ్ తిరిగి ప్రారంభం అని విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేశారు. ఈ
సంద‌ర్భంగా లైగర్ షూటింగ్ లొకేష‌న్ నుండి కొత్త స్టిల్‌ను రిలీజ్ చేశారు నిర్మాత‌ ఛార్మి. ఈ పోస్టర్ లో కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్న విజయ్ దేవరకొండ MMA ఫైటర్‌గా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ లో ఫారెన్ ఫైటర్స్ కూడా భాగం కాబోతున్నారు.

ఈ స్పోర్ట్స్ యాక్షన్ థిల్లర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ పూర్తిగా న్యూ లుక్ లోకి మారారు. మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని సినిమా కోసం నాచురల్ గా నటిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News