ఏపీ సీఎం జగన్​కు ఊరట.. బెయిల్ రద్దు పిటిషన్​ను కొట్టేసిన సీబీఐ కోర్టు.. !

ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న సీఎం జగన్​, ఎంపీ విజయ్​ సాయిరెడ్డి బెయిల్​ను రద్దు చేయాలని.. విచారణను వేగవంతం చేయాలని వైసీపీ రెబల్​ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు ఉన్న సీబీఐ కోర్టు ఈ పిటిషన్​ను కొట్టేసింది. జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. అప్పటి నుంచి తీర్పును రిజర్వ్​లో ఉంచింది. సీఎం జగన్​ […]

Advertisement
Update:2021-09-15 13:24 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్​కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న సీఎం జగన్​, ఎంపీ విజయ్​ సాయిరెడ్డి బెయిల్​ను రద్దు చేయాలని.. విచారణను వేగవంతం చేయాలని వైసీపీ రెబల్​ ఎంపీ రఘురామ కృష్ణం రాజు పిటిషన్​ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇరు వర్గాల వాదనలు ఉన్న సీబీఐ కోర్టు ఈ పిటిషన్​ను కొట్టేసింది. జూలై ఆఖరులో వాదనలు ముగిశాయి. అప్పటి నుంచి తీర్పును రిజర్వ్​లో ఉంచింది.

సీఎం జగన్​ ముఖ్యమంత్రిగా తనకుండే అధికారాలను ఉపయోగించి.. షరతులు ఉల్లంఘిస్తున్నారని రఘురామ తన పిటిషన్‌లో ఆరోపించారు. బెయిల్‌ రద్దుచేసి ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని కోరారు.

రఘురామకు మరోషాక్​..!
ఏపీ సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్లను సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ రఘురామ రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. జగన్‌, విజయసాయి బెయిల్‌ రద్దు పిటిషన్ల బదిలీకి నిరాకరణ తెలిపింది. రఘురామ రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags:    
Advertisement

Similar News