పెళ్లిసందD మూవీ టీజర్ రివ్యూ

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఈ సినిమాతో ఆయ‌న న‌టుడిగా కూడా ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై వస్తోంది ఈ సినిమా. ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌లో వస్తున్న ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం […]

Advertisement
Update:2021-09-14 15:38 IST

ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఈ
సినిమాతో ఆయ‌న న‌టుడిగా కూడా ఎంట్రీ ఇస్తుండ‌టం విశేషం. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను
ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్
బ్యాన‌ర్స్‌పై వస్తోంది ఈ సినిమా.

ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 'పెళ్లిసంద‌డి'లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌లో వస్తున్న ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. ఈరోజు ఈ సినిమా టీజ‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు.

హీరో రోష‌న్ స్టైలిష్ లుక్‌తో క్యారెక్ట‌రైజేష‌న్ ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యాన్ని సింపుల్‌గా చెప్పారు. అలాగే
లంగా ఓణిలో హీరోయిన్ శ్రీలీలను అందంగా ప్రెజెంట్ చేశారు. హీరో, హీరోయిన్ మ‌ధ్య రొమాంటిక్
స‌న్నివేశాల‌ను చూపించారు. మ‌రోవైపు హీరో రోషన్, హీరోయిన్ తండ్రి ప్రకాశ్‌రాజ్‌ మధ్య ఛాలెంజ్ చేసే సీన్‌తో సినిమాలో కేవ‌లం లవ్ సీన్స్ కాకుండా, ఇంకా మేటర్ ఉందనే విషయాన్ని చెప్పారు.

యాక్ష‌న్ స‌న్నివేశాలతో పాటు.. పెళ్లిలో హీరో, హీరోయిన్ స‌హా పెళ్లి బృంద‌మంతా క‌లిసి చేసే హ‌డావుడి, హీరో హీరోయిన్ మ‌ధ్య రొమాంటిక్ స‌న్నివేశాలు, క‌మ‌ర్షియ‌ల్ సాంగ్‌, ఎమోష‌న‌ల్ స‌న్నివేశాల‌ను చూపించారు. పెళ్లి భోజ‌నం ఎంత చ‌క్క‌గా ఉంటుందో అంతే చ‌క్క‌గా మా ‘పెళ్లి సంద‌D’ సినిమా ఉంటుంద‌నేలా టీజ‌ర్ ఉంది.

Full View

Tags:    
Advertisement

Similar News