ఆ సినిమాని నితిన్ పక్కనపెట్టినట్టే..?
రంగ్ దే రిలీజైపోయింది. మ్యాస్ట్రో ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. లెక్కప్రకారం ఈ రెండు సినిమాల తర్వాత పవర్ పేట సెట్స్ పైకి రావాలి. కానీ అనూహ్యంగా ఓ కొత్త సినిమాను ఎనౌన్స్ చేశాడు నితిన్. సినిమా లాంఛింగ్ కూడా జరిగిపోయింది. దీంతో పవర్ పేట ఇక రాదనే విషయం పక్కా అయింది. నిజానికి పవర్ పేట ఆగిపోయిన విషయం చాన్నాళ్ల కిందటే బయటకొచ్చింది. అయితే నితిన్ మాత్రం ఎక్కడా దాని గురించి ప్రస్తావించలేదు. ఈ గ్యాప్ లో వక్కంతం వంశీతో […]
రంగ్ దే రిలీజైపోయింది. మ్యాస్ట్రో ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది. లెక్కప్రకారం ఈ రెండు సినిమాల
తర్వాత పవర్ పేట సెట్స్ పైకి రావాలి. కానీ అనూహ్యంగా ఓ కొత్త సినిమాను ఎనౌన్స్ చేశాడు నితిన్. సినిమా లాంఛింగ్ కూడా జరిగిపోయింది. దీంతో పవర్ పేట ఇక రాదనే విషయం పక్కా అయింది.
నిజానికి పవర్ పేట ఆగిపోయిన విషయం చాన్నాళ్ల కిందటే బయటకొచ్చింది. అయితే నితిన్ మాత్రం ఎక్కడా దాని గురించి ప్రస్తావించలేదు. ఈ గ్యాప్ లో వక్కంతం వంశీతో సినిమా చేస్తాడనే ప్రచారం కూడా మొదలైంది. కానీ అంతలోనే రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాను స్టార్ట్ చేశాడు నితిన్.
ఈ సినిమాతో నితిన్ తన నిర్ణయాన్ని మరోసారి మార్చుకున్నట్టయింది. ఇకపై ప్రేమకథలకు దూరంగా
ఉంటానని, ప్రయోగాలు చేస్తానని చెప్పిన ఈ హీరో.. చెక్ సినిమా దెబ్బతో మళ్లీ పాత పంథాలోకి వచ్చాడు.
తాజా చిత్రం పూర్తిగా మాస్ కమర్షియల్ సినిమా. దీనికి మాచర్ల నియోజకవర్గం అనే టైటిల్ పెట్టారు. మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
నితిన్ సొంత బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో అతడి సరసన కృతి షెట్టి హీరోయిన్ గా నటించనుంది.
మరోసారి మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. వచ్చే నెల నుంచి ఈ సినిమా
రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.