101 జిల్లాల అందగాడు రివ్యూ

న‌టీన‌టులు : అవ‌స‌రాల శ్రీనివాస్‌, రుహానీ శ‌ర్మ, రోహిణీ, రమణ భాస్కర్ త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ : రామ్‌ సంగీతం : శ‌క్తికాంత్ కార్తీక్‌ స‌మ‌ర్ప‌ణ‌ : దిల్‌రాజు, జాగ‌ర్ల‌మూడి క్రిష్‌ నిర్మాత‌లు : శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి రచన : అవ‌స‌రాల శ్రీనివాస్‌ ద‌ర్శ‌క‌త్వం : రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌ రేటింగ్: 2.25/5 ఓ సినిమా వస్తుందంటే అందులో తమకు ఏం కావాలో ప్రేక్షకులు ముందే ఫిక్స్ అయిపోయారు. ఫలానా నటుడి సినిమా వస్తుందంటే […]

Advertisement
Update:2021-09-03 14:51 IST

న‌టీన‌టులు : అవ‌స‌రాల శ్రీనివాస్‌, రుహానీ శ‌ర్మ, రోహిణీ, రమణ భాస్కర్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ : రామ్‌
సంగీతం : శ‌క్తికాంత్ కార్తీక్‌
స‌మ‌ర్ప‌ణ‌ : దిల్‌రాజు, జాగ‌ర్ల‌మూడి క్రిష్‌
నిర్మాత‌లు : శిరీష్‌, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
రచన : అవ‌స‌రాల శ్రీనివాస్‌
ద‌ర్శ‌క‌త్వం : రాచ‌కొండ విద్యాసాగ‌ర్‌
రేటింగ్: 2.25/5

ఓ సినిమా వస్తుందంటే అందులో తమకు ఏం కావాలో ప్రేక్షకులు ముందే ఫిక్స్ అయిపోయారు. ఫలానా నటుడి సినిమా వస్తుందంటే అది అలా మాత్రమే ఉండాలని ముద్ర వేసేస్తారు. అలాంటప్పుడు తమ సినిమాల్లో ఆ ఎలిమెంట్స్ మాత్రమే చూపించాలి. ఒక్కముక్కలో చెప్పాలంటే వీటినే ”అంచనాలు” అంటారు. ఈ అంచనాల్ని అందుకోవడంలో అవసరాల తడబడ్డాడు. తన నుంచి ప్రేక్షకులు ఏం ఆశిస్తున్నారో తెలిసి కూడా బండిని పట్టాలు తప్పించాడు.

101 జిల్లాల అందగాడు సినిమాలో హీరోగా నటించాడు అవసరాల. బట్టతల కాన్సెప్ట్ తో సినిమా అనేది దాచకుండా ముందే చెప్పేశారు. బట్టతల అనగానే మూవీలో హిలేరియస్ కామెడీ ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. కానీ సినిమాకు రచనా సహకారం అందించిన అవసరాల శ్రీనివాస్, దర్శకత్వం వహించిన విద్యాసాగర్ మాత్రం ఎమోషన్ కూడా చూపించాలనుకున్నారు. అక్కడే వ్యవహారం తేడా కొట్టింది.

బట్టతల చుట్టూ ఎమోషన్ ఏంటి పైత్యం కాకపోతే అని మీరు మనసులో అనుకున్నప్పటికీ వీళ్లు మాత్రం సెకెండాఫ్ అదే చేశారు. పైపెచ్చు ఎమోషన్ పాయింట్ అయిన బట్టతలను వదిలేసి, ఒక దశలో తల్లి పాత్రకు కూడా షిఫ్ట్ అయ్యారు. ఇది చాలదన్నట్టు చివర్లో పర్సనాలిటీ డెవలప్ మెంట్ కొటేషన్లు, స్పీచులు అదనం. ఈ కాలం కూడా ఇలాంటి ముగింపు ఉంటుందా అని ప్రేక్షకుడు నోరెళ్లబెట్టాలా ఉందా క్లైమాక్స్.

ఇప్పుడు సింపుల్ గా కథలోకి వెళ్దాం.. కనస్ట్రక్షన్ కంపెనీలో పనిచేసే హీరోకు జుట్టు ఉండదు. వంశపారంపర్యంగా బట్టతల వస్తుంది. అలానే తిరిగితే అమ్మాయి పడదనే ఉద్దేశంతో విగ్గు పెట్టుకుంటాడు. అదే టైమ్ లో హీరోయిన్ ఆ కంపెనీలో చేరడం, ఇద్దరూ స్నేహితులుగా మారడం, ఆ తర్వాత ప్రేమికులుగా మారడం చకచకా జరిగిపోయాయి. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకునే టైమ్ లో.. హీరో గారికి జుట్టు లేదని, విగ్గుతో మేనేజ్ చేస్తున్నాడనే విషయం తెలిసిపోతుంది. అలా దూరమైన హీరోహీరోయిన్లు మళ్లీ కలిశారా లేదా అనేది స్టోరీ.

నటీనటుల విషయానికొస్తే.. అవసరాల శ్రీనివాస్ ఎప్పట్లానే సహజంగా చేశాడు. అతడి కామెడీ టైమింగ్ సూపర్బ్. కాకపోతే ఇంతకుముందే చెప్పుకున్నట్టు, తన రచనతో తనలోని హాస్యనటుడ్ని తన చేతులతో తానే చంపేసుకున్నాడు అవసరాల శ్రీనివాస్. రుహానీ శర్మ బాగా చేసింది. రోహిణితో పాటు మిగతావాళ్లంతా తమ పాత్రల మేరకు నటించారు.

టెక్నికల్ గా చూస్తే శక్తికాంత్ మ్యూజిక్ కొన్ని చోట్ల ప్లస్ అయింది, చాలాచోట్ల మైనస్ అయింది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ బాగుంది కానీ, సెకెండాఫ్ లో ఎడిటర్ కు స్వేచ్ఛ ఇచ్చినట్టులేదు. లేదంటే రన్ టైమ్ ఇంకాస్త తగ్గేది. దర్శకుడిగా రాచకొండ విద్యాసాగర్ కు ఇది పెర్ ఫెక్ట్ డెబ్యూ కాదు. అతడు మరో సినిమాతో నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోడానికేం లేదు.

ఓవరాల్ గా చెప్పాలంటే 101 జిల్లాల అందగాడు సినిమా అక్కడక్కడ నవ్విస్తుంది, సెకెండాఫ్ ఇబ్బంది పెడుతుంది. సెకండాఫ్ మొత్తాన్ని టేబుల్ పై మరోసారి తిరిగి రాసుకొని అప్పుడు సెట్స్ పైకి వెళ్తే బాగుండేదనే ఫీలింగ్ వస్తుంది. కష్టపడి థియేటర్ కు వెళ్లి చూసేకంటే, ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేయడం బెటర్.

Tags:    
Advertisement

Similar News