ఏపీలో టెన్త్ క్లాస్ మార్కుల విధానంలో కీలక మార్పు..

ఏపీలో టెన్త్ క్లాస్ మార్కుల విధానంలో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా మార్కుల ప్రకటనకు స్వస్తి చెప్పి కేవలం గ్రేడ్లను, పాయింట్లను మాత్రమే ప్రకటించేవారు. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. మళ్లీ పాత విధానాన్నే తెరపైకి తెచ్చారు. టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఇకపై గ్రేడ్లు, పాయింట్లు ఉండవు, అందరికీ మార్కులు ప్రకటిస్తారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. టెన్త్ ఫలితాలు రాగానే.. ఫస్ట్ […]

Advertisement
Update:2021-08-28 02:09 IST

ఏపీలో టెన్త్ క్లాస్ మార్కుల విధానంలో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. కొన్నాళ్లుగా మార్కుల ప్రకటనకు స్వస్తి చెప్పి కేవలం గ్రేడ్లను, పాయింట్లను మాత్రమే ప్రకటించేవారు. ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. మళ్లీ పాత విధానాన్నే తెరపైకి తెచ్చారు. టెన్త్ ఫైనల్ ఎగ్జామ్స్ లో ఇకపై గ్రేడ్లు, పాయింట్లు ఉండవు, అందరికీ మార్కులు ప్రకటిస్తారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.

టెన్త్ ఫలితాలు రాగానే.. ఫస్ట్ ర్యాంక్ మాదే, సెకండ్ ర్యాంక్ మాదేనంటూ కార్పొరేట్ సంస్థలు ప్రచార ఆర్భాటాలు చేసేవి. సహజంగా ఫస్ట్ ర్యాంక్, టాప్ మార్క్ లు వచ్చిన విద్యార్థి చదివిన విద్యాసంస్థపై తల్లిదండ్రులు కూడా ఆసక్తి చూపించేవారు. అలాంటి కార్పొరేట్ మాయాజాలాన్ని అడ్డుకోడానికి 2010లో గ్రేడింగ్ విధానం తీసుకొచ్చారు. ఫస్ట్ మార్కు, ఫస్ట్ ర్యాంక్ అంటూ ఏదీ ఉండదు, దీంతో కార్పొరేట్ ప్రచారం కూడా తగ్గిపోతుందని భావించింది ప్రభుత్వం. కానీ 10కి 10 సాధించిన మా విద్యార్థుల సంఖ్య ఇదీ అంటూ కొత్త తరహా ప్రచారం మొదలైంది. మార్కులివ్వకుండా గ్రేడ్లు ఇస్తే విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుందనే వాదన కూడా సరైనది కాదని రుజువైంది. దీంతో పాత విధానంలోనే మార్కులు ప్రకటించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే టెన్త్ క్లాస్ కి గ్రేడ్లు ప్రకటించినా, వాటిని మార్చి అందరికీ మార్కులు కేటాయిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ప్రకటించారు.

ఇంటర్ ప్రవేశాలకు తొలగిన అడ్డంకి..
ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఇంటర్ అడ్మిషన్లను ఆన్ లైన్ లో చేపట్టింది ఏపీ విద్యాశాఖ. అయితే గ్రేడ్లు, పాయింట్ల విధానంతో ఎవరికి ఫస్ట్ ప్రయారిటీ, ఎవరిది సెకండ్ ప్రయారిటీ అనే విషయంలో అడ్డంకి ఎదురైంది. ఇప్పుడు మార్కులు ప్రకటిస్తే, ఎవరు ముందు, ఎవరు తర్వాత అనేది తేలిపోతుంది. దీంతో 2020-21 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. కరోనా వల్ల గత రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు రద్దయ్యాయి. ఇంటర్నల్ మార్క్ ల ఆధారంగానే ఫలితాలు విడుదల చేశారు. ఇప్పుడు వాటిల్లో గ్రేడ్లు తీసేసి మార్కులు ఇస్తారు.

స్కూల్స్ లో కరోనా కేసులపై ప్రభుత్వం దృష్టి..
ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. పాఠశాలలు ప్రారంభించి 10 రోజులైందని, ప్రస్తుతం 74 శాతం నుంచి 85 శాతం హాజరు నమోదవుతోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం మంది ఉపాధ్యాయులకు టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. కేసులు నమోదైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పాఠశాలలను విడతల వారీగా ప్రారంభిస్తామని వివరించారు.

Tags:    
Advertisement

Similar News