శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ

ర‌చ‌న‌-దర్శకత్వం: కరుణ కుమార్ నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి బ్యానర్: 70mm ఎంటర్టైన్మెంట్స్ సంగీతం: మణిశర్మ నిడివి: 153 నిమిషాలు రిలీజ్: ఆగస్ట్ 27, 2021 రేటింగ్: 2.25/5 ఓ సినిమాకు మంచి కథ మాత్రమే కాదు, ఆ కథలో మంచి ట్విస్టులు కూడా ఉండాలి. అందుకే కథ అనుకున్నప్పుడే అందులో ట్విస్టులు గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు మేకర్స్. అయితే ఈ ప్రాసెస్ ను రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా శ్రీదేవి సోడా […]

Advertisement
Update:2021-08-27 10:18 IST

ర‌చ‌న‌-దర్శకత్వం: కరుణ కుమార్
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
బ్యానర్: 70mm ఎంటర్టైన్మెంట్స్
సంగీతం: మణిశర్మ
నిడివి: 153 నిమిషాలు
రిలీజ్: ఆగస్ట్ 27, 2021
రేటింగ్: 2.25/5

ఓ సినిమాకు మంచి కథ మాత్రమే కాదు, ఆ కథలో మంచి ట్విస్టులు కూడా ఉండాలి. అందుకే కథ
అనుకున్నప్పుడే అందులో ట్విస్టులు గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు మేకర్స్. అయితే ఈ
ప్రాసెస్ ను రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలా ఉంటుంది. అవును.. ఈ
సినిమా కోసం దర్శకుడు ముందుగా ట్విస్టులు అనుకున్నట్టుకున్నాడు. ఆ తర్వాత కథ అల్లినట్టున్నాడు.
దీంతో ఆ రెండు ట్విస్టులు మాత్రమే మెరిశాయి, కథ వాడిపోయింది.

రెండున్నర గంటలు కూర్చొని ఈ సినిమా అంతా చూసినా ఒకటే. చివరి 15 నిమిషాలు చూసినా ఒకటే. పెద్దగా తేడా అనిపించదు. చివరి ట్విస్ట్ కోసం 2 గంటల 15 నిమిషాల కథను అల్లిన దర్శకుడు.. ఆ అల్లికను ఒద్దికగా పొందుపరచలేకపోయాడు. మరీ ముఖ్యంగా బాగా పండాల్సిన లవ్ ట్రాక్ ఈ సినిమాకు పెద్ద మైనస్ అయి కూర్చుంది. సుధీర్ బాబు, ఆనంది మధ్య కెమిస్ట్రీ బొత్తిగా పండలేదు సరికదా.. ఓ దశలో ”అబ్బే ఇదేం ప్రేమ” అనిపిస్తుంది. రంగస్థలం, సైరాట్, ఉప్పెన కథల్ని పోలిన సినిమా ఇది. అలా అని వాటిలా కూర్చోబెట్టే సినిమా కాదిది. ఆ 3 సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ హైలెట్. అది ఇందులో మిస్ అయింది. అందుకే సోడా సెంటర్ ఫెయిల్ అయింది.

సినిమాను జైలు సీన్ తో ప్రారంభించిన దర్శకుడు ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. ఇదేమంత కొత్త
ఎత్తుగడ కాదు. ఇక అక్కడ్నుంచి హీరోహీరోయిన్లు ఎంట్రీ, ప్రేమలో పడడం, కులాలు ఒకటి కాకపోవడం,
మధ్యలో విలన్ ఎంటర్ అవ్వడం.. అన్నీ చకచకా జరిగిపోతాయి. ఇంటర్వెల్ తర్వాత ఏమైనా
ఊపందుకుంటుందా అంటే అది కూడా జరగదు. మళ్లీ అవే రొటీన్ సీన్స్. రొటీన్ స్క్రీన్ ప్లే. ప్రీ-క్లైమాక్స్ నుంచి కథ ఊపందుకుంటుంది. విలన్ ట్విస్ట్, ఆ తర్వాత వచ్చే మరో ట్విస్ట్ హైలెట్ అనిపిస్తాయి. అయితే అప్పటికే సహనం కోల్పోయిన ప్రేక్షకుడికి ఆ ట్విస్టులు చూసి సినిమాను హిట్ చేసేద్దాం అనిపించదు. పైపెచ్చు ట్విస్టులు బాగున్నప్పటికీ, వీటి కోసమా ఇంతసేపు దర్శకుడు కూర్చోబెట్టాడు అనే నిట్టూర్పులు వినిపిస్తాయి.

ఇంత చెప్పుకున్న తర్వాత ప్రత్యేకంగా సోడా సెంటర్ కథ గురించి చెప్పుకోవడం అనవసరం. పెర్ఫార్మెన్సుల విషయానికొస్తే.. సుధీర్ బాబు తొలిసారి కంప్లీట్ మాస్ లుక్ లో బాగా చేశాడు. అయితే అమలాపురం బ్యాక్ డ్రాప్ లో ఆ సిక్స్ ప్యాక్ మాత్రం సూట్ అవ్వలేదు. ఫైట్స్ విషయంలో చూడ్డానికి బాగున్నప్పటికీ, కథ-బ్యాక్ డ్రాప్ ను దృష్టిలో పెట్టుకుంటే సిక్స్ ప్యాక్ సిల్లీగా అనిపిస్తుంది. హీరోయిన్ ఆనంది చూడ్డానికి బాగాలేదు కానీ నటన మాత్రం ఇరగదీసింది. ఆమె చెప్పిన కొన్ని డైలాగ్స్ కు థియేటర్లలో చప్పట్లు పడ్డాయి.

టెక్నికల్ గా చూసుకుంటే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ పాటలు అంతగా ఎక్కవు. శ్యామ్ దత్
కెమెరావర్క్, రామకృష్ణ-మౌనిక ఆర్ట్ వర్క్ బాగుంది. ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ టైటిల్స్ కు మాత్రమే
పరిమితమయ్యాడు. అతడి వర్క్ పెద్దగా కనిపించదు. ఓవరాల్ గా చూసుకుంటే.. లవ్ ట్రాక్ క్లిక్ అయినట్టయితే శ్రీదేవి సోడా సెంటర్ సినిమా పెద్ద హిట్టయ్యేది.

Tags:    
Advertisement

Similar News