మొన్ననే రిలీజ్.. అంతలోనే ఓటీటీ

థియేట్రికల్ రిలీజ్ కు, ఓటీటీ స్ట్రీమింగ్ కు కనీసం 7 వారాల గ్యాప్ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అమల్లోకి వచ్చేసరికి మాత్రం దాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. లక్ష రూపాయలు అదనంగా వచ్చినా వెంటనే ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇచ్చేయడానికి రెడీ అయిపోతున్నారు. గతంలో అక్షర అనే సినిమా విడుదలైన 5 రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఇప్పుడు మరో రెండు సినిమాలు చకచకా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సత్యదేవ్ నటించిన తిమ్మరుసు, కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. […]

Advertisement
Update:2021-08-25 12:33 IST

థియేట్రికల్ రిలీజ్ కు, ఓటీటీ స్ట్రీమింగ్ కు కనీసం 7 వారాల గ్యాప్ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అమల్లోకి వచ్చేసరికి మాత్రం దాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. లక్ష రూపాయలు అదనంగా వచ్చినా వెంటనే ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇచ్చేయడానికి రెడీ అయిపోతున్నారు. గతంలో అక్షర అనే సినిమా విడుదలైన 5 రోజుల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఇప్పుడు మరో రెండు సినిమాలు చకచకా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

సత్యదేవ్ నటించిన తిమ్మరుసు, కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కల్యాణమండపం సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈ రెండు సినిమాలు ఈనెల 28న ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. తిమ్మరుసు సినిమా నెట్ ఫ్లిక్స్ లో, ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు ఈమధ్యే థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే.

కేవలం పెద్ద సినిమాలు మాత్రమే అంతోఇంతో ఈ నిబంధనను పాటిస్తున్నాయి. చిన్నాచితకా సినిమాలన్నీ 2-3 వారాలకే ఓటీటీలో ప్రత్యక్షమైపోతున్నాయి. నిజానికి ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాకు బజ్ బాగుంది. అయినప్పటికీ ఈ సినిమా కూడా మరో 3 రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తోంది.

Tags:    
Advertisement

Similar News