శ్రీదేవి సోడాకు లైన్ క్లియర్ అయింది

పక్కా ప్లానింగ్ తో వస్తోంది శ్రీదేవి సోడా సెంటర్ సినిమా. కాస్త ముందుగానే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. దాని కంటే ముందే ట్రయిలర్ రిలీజ్ చేశారు. దశలవారీగా సాంగ్స్ రిలీజ్ కార్యక్రమం నడుస్తోంది. మరోవైపు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్రచారం కూడా ప్రారంభమైంది. ఇప్పుడు చివరి స్టెప్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తిచేశారు. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు సెన్సార్ అధికారులు లైన్ క్లియర్ చేశారు. ఎలాంటి కట్స్ లేకుండా యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా నిడివి 2 గంటల […]

Advertisement
Update:2021-08-24 15:24 IST

పక్కా ప్లానింగ్ తో వస్తోంది శ్రీదేవి సోడా సెంటర్ సినిమా. కాస్త ముందుగానే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. దాని కంటే ముందే ట్రయిలర్ రిలీజ్ చేశారు. దశలవారీగా సాంగ్స్ రిలీజ్ కార్యక్రమం నడుస్తోంది. మరోవైపు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ప్రచారం కూడా ప్రారంభమైంది. ఇప్పుడు చివరి స్టెప్ గా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తిచేశారు.

శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు సెన్సార్ అధికారులు లైన్ క్లియర్ చేశారు. ఎలాంటి కట్స్ లేకుండా యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు ఉంది. సెన్సార్ క్లియర్ అవ్వడంతో మేకర్స్ తమ ప్రచారాన్ని మరింత పెంచారు. మరోవైపు ఆన్ లైన్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 27న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అటు ఓవర్సీస్ లో 26నే ప్రీమియర్స్ స్టార్ట్ కాబోతున్నాయి.

ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు హీరో సుధీర్ బాబు. సమ్మోహనం తర్వాత సరైన హిట్ లేని ఈ
హీరో, మాస్ హిట్ కోసం చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. అలాంటి మాస్ హిట్ శ్రీదేవి సోడా సెంటర్
రూపంలో తనకు దక్కుతుందని ఆశపడుతున్నాడు. పలాస ఫేమ్ కరుణకుమార్ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో
ఆనంది హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతం అందించాడు.

Tags:    
Advertisement

Similar News