చిరంజీవి-బాబి మూవీ అప్ డేట్
బాబి దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరు బర్త్ డే సందర్భంగా ఆ మూవీ డీటెయిల్స్ బయటపెట్టారు. టైటిల్ చెప్పకపోయినప్పటికీ సినిమా జానర్ ఏంటి, చిరు గెటప్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని పోస్టర్ రూపంలో బయటపెట్టారు. పోస్టర్‌ను గమనిస్తే.. తలకు రెడ్ టవల్ చుట్టుకుని, బీడి కాలుస్తూ, లుంగీ కట్టుకుని నిల్చున్న చిరంజీవి లుక్ ఊరమాస్‌గా అనిపిస్తుంది. చేతిలో లంగరు(యాంకర్) పట్టుకుని బోటుపై చిరంజీవి స్టైల్‌గా ఉన్నారు. అటు పక్కనున్న జెండాపై చిరంజీవి ఇష్టదైవం హనుమంతుడు […]
బాబి దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. చిరు బర్త్ డే సందర్భంగా ఆ మూవీ డీటెయిల్స్ బయటపెట్టారు. టైటిల్ చెప్పకపోయినప్పటికీ సినిమా జానర్ ఏంటి, చిరు గెటప్ ఎలా ఉండబోతోందనే విషయాన్ని పోస్టర్ రూపంలో బయటపెట్టారు.
పోస్టర్‌ను గమనిస్తే.. తలకు రెడ్ టవల్ చుట్టుకుని, బీడి కాలుస్తూ, లుంగీ కట్టుకుని నిల్చున్న చిరంజీవి లుక్ ఊరమాస్‌గా అనిపిస్తుంది. చేతిలో లంగరు(యాంకర్) పట్టుకుని బోటుపై చిరంజీవి స్టైల్‌గా ఉన్నారు. అటు పక్కనున్న జెండాపై చిరంజీవి ఇష్టదైవం హనుమంతుడు కనిపిస్తున్నాడు. ఉదయిస్తున్న సూర్యుడు చిరంజీవి అనే విషయాన్ని తెలియజేసేలా అప్పుడే తెల్లవారుతుండగా పైకి వస్తున్న సూర్యుడిని కూడా పోస్టర్‌లో చూడవచ్చు. అలాగే బోటులోని కొంత మంది జాలర్లు బోటుపై నిల్చున్న చిరంజీవిని చూస్తున్నారు. వారందరూ సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లేలా కనిపిస్తుంది.
ఈ లుక్ చూస్తుంటే చిరంజీవి ముఠామేస్త్రీ, ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు చిత్రాల్లోని వింటేజ్ మాస్ లుక్ గుర్తుకు వస్తుంది. ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. ఆచార్య తర్వాత చిరంజీవి చేస్తున్న సినిమాలన్నీ రీమేక్ లే. వేదాళం రీమేక్ గా భోళా శంకర్ వస్తోంది. లూసిఫర్ రీమేక్ గా గాడ్ ఫాదర్ వస్తోంది. కేవలం బాబి సినిమా మాత్రమే ఒరిజినల్ స్టోరీ.