అటు స్వర్గం.. ఇటు నరకం
నాగార్జున, నాగచైతన్య హీరోలుగా బంగార్రాజు సినిమా తాజాగా మొదలైన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ సినిమాను లాంఛనంగా స్టార్ట్ చేసి, అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి డీటెయిల్స్ ఒక్కొక్కొటిగా బయటకొస్తున్నాయి. బంగార్రాజు సినిమా కోసం ప్రస్తుతం 2 సెట్స్ రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి స్వర్గం సెట్ కాగా, ఇంకోటి నరకం సెట్. ఒక సెట్ ను అన్నపూర్ణ స్టుడియోస్ లో, రెండో సెట్ ను రామోజీ […]
నాగార్జున, నాగచైతన్య హీరోలుగా బంగార్రాజు సినిమా తాజాగా మొదలైన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ
స్టుడియోస్ లో ఈ సినిమాను లాంఛనంగా స్టార్ట్ చేసి, అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ కూడా
మొదలుపెట్టారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి డీటెయిల్స్ ఒక్కొక్కొటిగా బయటకొస్తున్నాయి. బంగార్రాజు సినిమా కోసం ప్రస్తుతం 2 సెట్స్ రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి స్వర్గం సెట్ కాగా, ఇంకోటి నరకం సెట్.
ఒక సెట్ ను అన్నపూర్ణ స్టుడియోస్ లో, రెండో సెట్ ను రామోజీ ఫిలింసిటీలో వేస్తున్నారు. మొదటి 2
షెడ్యూల్స్ ను ఈ 2 సెట్స్ లో పూర్తిచేయాలని అనుకుంటున్నారు. సెమీ ఫాంటసీ మూవీగా వస్తున్న
బంగార్రాజులో గ్రాఫిక్స్ కు కూడా ప్రాధాన్యం ఉంది. సినిమాలో దాదాపు 30 నిమిషాల పాటు గ్రాఫిక్స్
ఉంటాయని వెల్లడించాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ.
ఇక నాగ్, నాగచైతన్య పాత్రలపై కూడా దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. ఇద్దరివీ రెండు పాత్రలు కాదని
చెప్పుకొచ్చాడు. యంగ్ నాగార్జున పాత్రలో నాగచైతన్య కనిపిస్తాడని, అలాగే యంగ్ రమ్యకృష్ణ పాత్రలో కృతి షెట్టి కనిపిస్తుందని స్పష్టత ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో అఖిల్ ను కూడా అనుకున్నప్పటికీ కాల్షీట్ల సమస్య వల్ల అఖిల్ ను తీసుకోలేదంటున్నాడు కల్యాణ్ కృష్ణ.