శ్రీవిష్ణుకు వెంకటేష్ ఆశీస్సులు
హీరో శ్రీవిష్ణు, వెంకటేష్ అభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. పలు సందర్భాల్లో వెంకీని కలిసిన శ్రీవిష్ణు, ఈమధ్య కాలంలో తన ఫేవరెట్ హీరోకు మరింత దగ్గరయ్యాడు. మరీ ముఖ్యంగా రాజ రాజ చోర సినిమా గురించి వెంకీతో పలుమార్లు చర్చించిన విషయాన్ని బయటపెట్టాడు శ్రీవిష్ణు. “ఈ సినిమా చేసే ముందు వెంకటేష్ గారికి ప్రాజెక్ట్ గురించి చెప్పాను. అప్పటి నుండి ఆయన విషెస్ నాకు ఉన్నాయి. టీజర్ చూసి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఇక నిన్న […]
హీరో శ్రీవిష్ణు, వెంకటేష్ అభిమాని అనే విషయం అందరికీ తెలిసిందే. పలు సందర్భాల్లో వెంకీని కలిసిన
శ్రీవిష్ణు, ఈమధ్య కాలంలో తన ఫేవరెట్ హీరోకు మరింత దగ్గరయ్యాడు. మరీ ముఖ్యంగా రాజ రాజ చోర సినిమా గురించి వెంకీతో పలుమార్లు చర్చించిన విషయాన్ని బయటపెట్టాడు శ్రీవిష్ణు.
“ఈ సినిమా చేసే ముందు వెంకటేష్ గారికి ప్రాజెక్ట్ గురించి చెప్పాను. అప్పటి నుండి ఆయన విషెస్ నాకు
ఉన్నాయి. టీజర్ చూసి ఆయన ఫోన్ చేసి మాట్లాడారు. ఇక నిన్న వెళ్లి కలిశాను. టీజర్ బాగుందన్నారు.
సినిమా కూడా డెఫినెట్ గా బాగుంటుందనిపిస్తుందంటూ శుభాకాంక్షలు చెప్పారు.”
రాజ రాజ చోర సినిమా గురించి వెంకీకి అప్ డేట్స్ ఇవ్వడానికి ఓ రీజన్ ఉందంటున్నాడు శ్రీవిష్ణు. ఈ సినిమా చూస్తే, వెంకీ గతంలో నటించిన కొన్ని ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు గుర్తొస్తాయని, అంత కామెడీగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. సినిమాలో కూడా అక్కడక్కడ వెంకీ ఫొటోలు కనిపిస్తాయని, టీజర్ లో కూడా ఉందని వివరించాడు.