లవ్ స్టోరీ.. కొత్త డేట్ వచ్చేసింది
సెప్టెంబర్ 10న లవ్ స్టోరీ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందంటూ ఇప్పటికే లీకులు వచ్చేశాయి. ఇప్పుడదే నిజమైంది. ఈరోజు ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న లవ్ స్టోరీ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇప్పటిది కాదు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ వేవ్ కంటే ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. అలా పడుతూ లేస్తూ, […]
సెప్టెంబర్ 10న లవ్ స్టోరీ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందంటూ ఇప్పటికే లీకులు వచ్చేశాయి.
ఇప్పుడదే నిజమైంది. ఈరోజు ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. వినాయక చవితి కానుకగా
సెప్టెంబర్ 10న లవ్ స్టోరీ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.
నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇప్పటిది కాదు. ఇంకా చెప్పాలంటే ఫస్ట్
వేవ్ కంటే ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. అలా పడుతూ లేస్తూ, ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఎట్టకేలకు వచ్చేనెల 10న రిలీజ్ చేయబోతున్నారు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కింది లవ్ స్టోరీ సినిమా. నాగచైతన్య-సాయిపల్లవి కలిసి నటించడం ఇదే తొలిసారి. పాటలకు ఇప్పటికే పెద్ద రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆహా సంస్థ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది.