లవ్ స్టోరీకి డేట్ ఫిక్స్ అయినట్టేనా?

దాదాపు ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తోంది లవ్ స్టోరీ అనే సినిమా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, కరోనా సెకెండ్ వేవ్ వల్ల మరోసారి వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్లు తెరిచినప్పటికీ సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే, ఏపీలో చాలా చోట్ల థియేటర్లు తెరుచుకోలేదు. పైగా టిక్కెట్ రేట్లు తగ్గించారు. ఇక ఏపీ, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ అనుకున్న స్థాయిలో లేదు. ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకొని లవ్ స్టోరీ […]

Advertisement
Update:2021-08-17 15:28 IST

దాదాపు ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తోంది లవ్ స్టోరీ అనే సినిమా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో
నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా, కరోనా సెకెండ్ వేవ్ వల్ల మరోసారి వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్లు తెరిచినప్పటికీ సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే, ఏపీలో చాలా చోట్ల థియేటర్లు తెరుచుకోలేదు. పైగా టిక్కెట్ రేట్లు తగ్గించారు. ఇక ఏపీ, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ అనుకున్న స్థాయిలో లేదు.

ఈ కారణాలన్నీ దృష్టిలో పెట్టుకొని లవ్ స్టోరీ సినిమాను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్నారు.
దీనికితోడు ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు ప్రకటించడంతో, తప్పనిసరి
పరిస్థితుల మధ్య థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఈ సినిమాకు మరో
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 10న లవ్ స్టోరీ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో చర్చలు ప్రారంభించారు. ఇదే కనుక జరిగితే సెకండ్ వేవ్ తర్వాత
రిలీజవుతున్న తొలి పెద్ద సినిమా ఇదే అవుతుంది. ఇప్పటివరకు థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రమే
రిలీజ్ అవుతూ వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News